జలుబు, దగ్గు, జ్వరం ఈ మూడు మనకు బాగా తెలిసిన ఇన్ఫెక్షన్లే. అయితే మరి గత ఆరు నెలలుగా ఈ లక్షణాల విషయంలో మనం ఎందుకు గాభరా పడుతున్నాం? జ్వరం వస్తే అంత ఆందోళన ఎందుకు చెందుతున్నాం?
కరోనా వైరస్ లేదా కోవిడ్ వ్యాధి
మనకు సాధారణంగా వచ్చే జ్వరం, దగ్గు, జలుబు వంటి ఇన్ఫెక్షన్లను మనకే కొత్తగా పరిచయం చేస్తున్న కొత్త వ్యాధి కోవిడ్. కరోనా వైరస్ ఎలా వ్యాపిస్తుంది? కరోనా వైరస్ నుంచి సోకిన కోవిడ్ వ్యాధిలో ఎటువంటి లక్షణాలు ఉంటాయి? కోవిడ్ సోకితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఇలా కోవిడ్ వ్యాధి విషయంలో మనం ఇప్పటికే చాలా విషయాలను తెలుసుకున్నాం. దాని గురించి ఇంకా ఇంకా పరిశోధనలు జరుగుతున్న తరుణంలో ఒక కొత్త అంశం వెలుగులోకి వచ్చింది. అదేంటంటే కోవిడ్ లక్షణాలు వస్తూ పోతూ ఉంటాయట.
అవునా? ఇలా కూడా జరిగే అవకాశం ఉందా?
ఒక వ్యక్తికి ఒకసారి కరోనా సోకింది, తగ్గిపోయింది. తరువాత కొంతకాలానికి మళ్ళీ అతనిలో లక్షణాలు కనిపించాయి. కానీ అతను బాగానే ఉన్నాడు. ఇది చాలా సాధారణ విషయంగా కనిపించబోతోంది అంటే మీకు ఆశ్చర్యంగా ఉంది కదూ!
ఈ రోజు వరకు కోవిడ్ వ్యాధి గురించి మన అవగాహనలోకి వచ్చిన అంశాల ప్రకారం కోవిడ్ వ్యాధి తగ్గి కోలుకుంటున్న వ్యక్తిలో కోవిడ్ వ్యాధి లక్షణాలు మళ్ళీ తారసపడవచ్చు.
లక్షణాలు మళ్ళీ కనిపిస్తే అదేమీ ఆందోళన చెందాల్సిన విషయం కాదు. కొన్ని అనారోగ్యాలు, సాధారణంగా వచ్చే జలుబు, ముక్కు పట్టేయడం, అలసటగా అనిపించడం, ముక్కు ఎండిపోవడం, ఎనర్జీ లెవెల్స్ తిరిగి రావడం వంటి లక్షణాలు మళ్ళీ మీలో కనిపిస్తాయట.
అకస్మాత్తు లక్షణాలు
అయితే కోవిడ్ వ్యాధి బారిన పడి కోలుకుంటున్న వారిలో ఒక్క రాత్రిలోనే వారికి జ్వరం వచ్చి తగ్గిపోవచ్చు, ఒకేసారి జ్వరం ఎక్కువై మళ్ళీ నార్మల్ కి రావచ్చు లేదా జ్వరం ఒక రెండు రోజులు ఉండి తగ్గిపోవచ్చు మళ్ళీ లో గ్రేడ్ జ్వరం రావచ్చు. అంతేకాకుండా అప్పటివరకూ తగ్గుముఖం పట్టిన దగ్గు అకస్మాత్తుగా ఎక్కువ కావచ్చు.
ఇప్పటివరకు జరిగిన పరిశోధనల ప్రకారం కోవిడ్ బారిన పడి కోలుకుంటున్నవారిలో ఇటువంటి అకస్మాత్తు లక్షణాలు సాధారణమే అంటున్నారు నిపుణులు. అయితే కోవిడ్ వ్యాధి వచ్చి నయమవుతున్న నాలుగు వారాలలో ఈ అకస్మాత్తు లక్షణాలు కూడా తగ్గుముఖం పడతాయి.
కొంత ఎక్కువకాలం పట్టవచ్చు
చాలా తక్కువమందిని మాత్రమే కోవిడ్ వ్యాధి చాలా కాలం వరకు వారిని లక్షణాలతో వేధిస్తుంది. కాస్త వయసు పైబడిన వారు, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు ఇంకొంత కాలం కోవిడ్ వ్యాధి లక్షణాలు భరించాల్సి ఉంటుంది. ఇటువంటి వ్యక్తులు కోవిడ్ తగ్గినా కూడా వారి పట్ల వారు చాలా జాగ్రతగా వ్యవహరించాల్సి ఉంటుందనేది నిపుణుల సలహా.
నోట్ చేసుకోండి
ఏ వ్యక్తి అయినా కోవిడ్ టెస్ట్ చేయించుకున్న తరువాత రిజల్ట్ పాజిటివ్ అని తేలితే (ఒకవేళ లక్షణాలను గుర్తించి టెస్ట్ చేయించుకోకపోయినా) వెంటనే డాక్టర్ ని కలిసి తగిన చికిత్స తీసుకోవాలి. మీకు దగ్గు, జలుబు, జ్వరం, అలసట వంటి లక్షణాలు కనిపిస్తే వాటి తీవ్రతను, హెచ్చు తగ్గులను ఎప్పటికప్పుడు రాసుకోవడం మంచిది. ఎందుకంటే మీరు డాక్టర్ ని కలిసినపుడు మీ లక్షణాల తీవ్రతను గురించి డాక్టర్ కి తెలియజేయడం ద్వారా చికిత్స సులువవుతుంది. ఇలా చేస్తే వైద్యులు కూడా మీకు చాలా మంచి చికిత్సను అందించగలుగుతారు.
[wpdiscuz-feedback id=”1k5m532haz” question=”Please leave a feedback on this” opened=”0″][/wpdiscuz-feedback]