గోళ్లు మన ఆరోగ్యానికి ప్రతిబింబం అని చెప్పవచ్చు. చాలా మంది గోళ్ల ఆరోగ్యాన్ని, అందాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. కొంచెం శ్రద్ద తీసుకుంటే గోళ్లను ఎంతో అందంగా ఉండేలా చేసుకోవచ్చు.
Nail Health
గోళ్ళను చూసి మన ఆరోగ్యం ఎలా ఉందో గుర్తించవచ్చు. గోళ్ల ఎదుగుదల తక్కువగా ఉండి పసుపు రంగులో మందంగా ఉంటే మూత్రపిండాల ఆరోగ్యం సరిగ్గా లేదని అనుమానించాలి. గోళ్లు పాలిపోయినట్లుగా ఉంటే రక్తహీనత, అదే గోళ్లు లేత గులాబీ రంగులో ఉంటే రక్తం తగినంత ఉందని అర్థం చేసుకోవచ్చు. అదే గోళ్లపై తెల్లటి ప్యాచెస్ ఉంటే కాల్షియం లోపంగా గుర్తించాలి.
గోళ్లను కొరికే అలవాటుంటే వెంటనే ఆ అలవాటును మానేయాలి.
సరైన పోషకాహారం తీసుకోకపోతే ఆ ప్రభావం గోళ్లపై పడుతుంది. విటమిన్ బి, సి లోపం వల్ల గోళ్లు చిట్లే అవకాశం ఉంటుంది.
అందువలన ప్రొటీన్లు, విటమిన్ ఈ, ఎ గోళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి. అందువల్ల ప్రొటీన్లు, విటమిన్ ఈ, ఎ సమృద్ధిగా లభించే ఆహారం తీసుకోవాలి.
విటమిన్ ఈ క్యాప్సూల్‌ని బ్రేక్ చేసి అందులోని నూనెను గోళ్లపై రాసుకుని మర్ధన చేసుకుంటే గోళ్లు సుతి మెత్తగా, ఆరోగ్యవంతంగా ఉంటాయి.
Nail Health గోళ్లు పెళుసుగా ఉంటే వేడి నీటిలో కొంచెం నిమ్మరసం, ఆలివ్ ఆయిల్ కలపాలి. ఆ నీళ్లలో స్పాంజ్‌ని తడిపి దానితో గోళ్లను శుభ్రం చేసుకోవాలి. తర్వాత గోళ్లకు మాయిశ్చరైజింగ్ క్రీము లేదా లోషన్ రాయాలి.
గోళ్లపై ఎక్కువగా గీతలు పడితే వేడినీటిలో నిమ్మరసం కలిపి అందులో ఒక 20 నిమిషాల పాటు గోళ్లను నానబెట్టుకుని తర్వాత మాయిశ్చరైజింగ్ క్రీము రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. వీటిని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.
మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.