14 రోజుల క్వారంటైన్ లో ఏం జరుగుతుందో తెలుసా?

14 days quarantine

ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది కరోనా వ్యాధి బారిన పడి ప్రాణాలు పోగొట్టుకొంటున్నారు. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ సోకిన బాధితులను, అనుమానితులను క్వారంటైన్ లో ఉంచాలని ప్రభుత్వాలు అంటున్నాయి. అయితే విదేశాల నుంచి వచ్చిన వారిని 14 రోజుల క్వారంటైన్ తరువాతనే స్వస్థలాలకు అనుమతినిస్తున్నారు. అసలు అనుమానితులు కానీ బాధితులు కానీ క్వారంటైన్ లో ఉన్నపుడు ఏంజరుగుతుంది? ఇంతకుముందు ఎవరెవరు ఈ పద్ధతిని పాటించారు? ఇది ఎక్కడ మొదలైంది? మీ మెదళ్ళను తొలిచేస్తున్న సందేహాలకు సమాధానం ఇదిగో.  

ఉదయం లేచిన దగ్గర నుంచి క్వారంటైన్ అనే మాటని మధ్య మనం రోజు వింటూనే ఉన్నాం. ఈ పదం ఇప్పుడు పుట్టింది కాదు. 14వ శతాబ్ధంలో ప్లేగు వ్యాధి ప్రబలింది. ఆ సమయంలో ఇటలీ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది. ప్లేగు ప్రభావిత దేశాల నుంచి తమ దేశాలకు వస్తున్న ఓడల ద్వారా ఈ వ్యాధి తమ దేశంలోనూ వ్యాపిస్తుందని భావించిన ఇటలీ దీన్ని కట్టడి చేయాలని నిర్ణయించింది. ఇతర దేశాల నుంచి వచ్చిన వారిని తమ దేశస్థులతో కలవనీయకుండా వారిని 40 రోజుల పాటు ఐసోలేషన్ లో ఉంచాలని నిర్ణయించింది. దీన్ని ఇటలీ భాషలో క్వారంట జోర్ని అంటే 40 రోజులు అని అర్థం. ఆ తరువాత రోజుల్లో ఈ పదాలు ‘క్వారంటినో’ క్వారంటైన్ గా మారిపోయాయి. వ్యాధి ఇతరులకు వ్యాప్తి చెందకుండా ఈ పద్ధతి బాగా ఉపయోగపడేది.

Quarantine

1665లో బ్రిటన్ లో ప్లేగు వ్యాధి 14 నెలల పాటు ప్రభావం చూపింది. ఆ సమయంలో ఇయామ్ అనే గ్రామస్తులు వ్యాధి ఇతరులకు సోకకూడదని అందరూ క్వారంటైన్ లోకి వెళ్ళటం జరిగింది. 1793లో యుఎస్ మొత్తం పచ్చకామెర్లు సోకడం మొదలైంది. అప్పుడు యూఎస్ మొత్తం లో 5 వేల మంది మరణించారు. ఈ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని కామన్వెల్త్ ఆఫ్ ఫిలాడెల్ఫియా ఏకంగా దేవలార్ నదిపై కారంటైన్ కేంద్రాన్ని నిర్మించింది.

1814లో ఆస్ట్రేలియా తొలిసారిగా క్వారటైన్ ను పాటించింది. జులై 28న ఇంగ్లండ్ నుంచి సుర్రి అనే ఓడ సిడ్నీ ఓడరేవుకు చేరుకుంది. ఇంగ్లండ్ నుంచి సిడ్నీ ఓడరేవుకు ప్రయాణిస్తున్న ఆ ఓడలో 46 మంది టైఫాయిడ్ వచ్చి మరణించారు. దీంతో సిడ్నీ చేరుకున్న వెంటనే ఆస్ట్రేలియా ప్రభుత్వం ఆ ఓడలో ప్రయాణిస్తున్న వారిని క్వారంటైన్ కు పంపించింది. ఆ తరువాత ప్రపంచంలోనే అత్యంత విషాదాన్ని మిగిల్చిన స్పానిష్ ఫ్లూ సమయంలోనూ అమెరికా, యూరప్ దేశాలు క్వారంటైన్ విధానాన్ని అమలు పరిచాయి. 1918లో  వచ్చిన స్పానిష్ ఫ్లూ ప్రపంచ వ్యాప్తంగా ఐదు కోట్ల మందిని బలి తీసుకుంది. దీనిని నియంత్రించడానికి అమెరికా యూరప్ దేశాలు తీసుకున్న కఠినమైన చర్యల్లో ఒకటి క్వారటైన్. అంతటి అద్భుతమైన ఫలితాలను ఇచ్చే పద్దతే ఈ క్వారటైన్.

ఈ క్వారంటైన్ వైరస్ ను మొత్తంగా తరిమి కొత్తకపోయినా వ్యాధి ఒకరి నుంచి ఒకరికి వ్యాపించకుండా అరికట్టగలుగుతుంది. తాజాగా వచ్చిన కరోనా వైరస్ విషయంలోనూ ప్రపంచ దేశాలు ఈ క్వారంటైన్ పద్ధతినే పాటిస్తున్నాయి. అయితే వైద్య శాస్త్రంలో వచ్చిన మార్పుల దృష్ట్యా, వైరస్ లక్షణాల్లో మార్పుల దృష్ట్యా ఈ క్వారటైన్ ను 14 రోజులకు తగ్గించారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top
Scroll to Top