గర్భవతులు, పిల్లలకు ఇచ్చే ప్రతి టీకా ముందు నిపుణులైన వైద్యుల చేత పరీక్షలు చేయబడుతుంది. అవి ప్రయోజనకరమని తేలిన తర్వాతే వాటిని ప్రజలకు అందించడం జరుగుతుంది. ఈ పరిస్థితుల్లో టీకాల విషయంలో ఎలాంటి అపోహ అవసరం లేదు. అయితే అలర్జీ లాంటివి ఉన్న వారు, వైద్యుని సలహా మేరకు మాత్రమే వీటిని తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. సాధారణంగా గర్భిణులకు కొన్ని రకాల టీకాలను మాత్రమే అందిస్తారు. వీటిలో ప్రదైనమైనది హెపటైటిస్ బి వ్యాక్సిన్. హెపటైటిస్ బి రావడానికి ఆస్కారం ఉన్న వారికి, కాన్సుకు ముందు తర్వాత ఈ టీకా ఇస్తారు. తల్లి, శిశువుల ఆరోగ్యాన్ని కాపాడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. మొదటి డోసు ఇచ్చిన నెలకు మరో డోసు, 6 నెలలకు ఇంకో డోసు చొప్పున మొత్తం మూడు మార్లు దీన్ని అందిస్తారు.
గర్భధారణ సమయంలో తీవ్రమైన అనారోగ్యాల్ని నివారించేందుకు ఇన్ఫ్లూయెంజా టీకాను అందిస్తారు. మూడో మాసంలో దీన్ని వైద్యుని సలహా మేరకు తీసుకోవడం తప్పనిసరి. శిశివును టెటనస్ లాంటి ప్రమాదకరమైన వ్యాధుల నుంచి రక్షించేందుకు మరో టీకా అందిస్తారు. 27 నుంచి 36 వారాల మధ్య కాలంలో దీన్ని తీసుకోవలసి ఉంటుంది. ఇది అందించకపోతే… శిశువు పుట్టిన వెంటనే TDAP పరీక్ష చేయవలసి ఉంటుంది.
పుట్టబోయే బిడ్డకు హాని చేస్తాయనుకునే ఏ టీకాను కూడా గర్భిణులకు ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వరు. ముఖ్యంగా లైవ్ వైరస్ టీకాలు అసలు ఇవ్వరు. మరి కొన్ని వ్యాక్సిన్లు మాత్రం బిడ్డ పుట్టిన తర్వాత ఇస్తారు. అందుకే టీకాల విషయంలో బిడ్డ గురించి తల్లి బెంగపడాల్సిన పనిలేదు. సరైన వైద్యుని పర్యవేక్షణలో వీటిని తీసుకోవడం తల్లిబిడ్డలకు సురక్షితం. కొన్ని రకాల టీకాలు గర్భస్రావం, పుట్టబోయే బిడ్డలో లోపాలకు కారణం అవుతాయి.
ముఖ్యంగా హెపటైటిస్ ఏ వ్యాక్సిన వల్ల చాలా నష్టాలు ఉన్నాయి. అదే విధంగా రూబెల్లా వ్యాక్సిన్ గర్భం ధరించడానికి నెల ముందే తీసుకుని ఉండాలి. సాధారణంగా దీన్ని కాన్సు తర్వాత అందిస్తారు. చికెన్ పాక్స్ నివారించే వరిసెల్లా టీకాను సైతం గర్భధారణకు కనీసం నెల ముందు తీసుకోవాలి. న్యూమోకాకల్ టీకా ఎంత వరకూ ప్రమాదమో తెలియదు గనుక గర్భిణులు దీన్ని తీసుకోకపోవడమే మేలు. అదే విధంగా పోలియో వ్యాక్సిన్ కూడా గర్భిణి స్త్రీలకు ఇవ్వరు. HPV టీకాలది కూడా దాదాపు ఇదే పరిస్థితి.
ఏ టీకా అయినా పుట్టబోయే బిడ్డకు, తల్లికి ఎంత మేరకు శ్రేయస్కరం అనే విషయాన్ని గుర్తు పెట్టుకునే గర్భిణులకు ఇస్తారు. అయితే గర్భం ధరించడానికి కనీసం నెల ముందు కొన్ని రకాల టీకాలు తీసుకోవాలి. ఈ విషయంలో తల్లులు కచ్చితంగా అవగాహనతో వ్యవహరించాలి. ఈ విషయాన్ని వైద్యునికి తెలియజేసి, సమస్యల గురించి తెలుసుకోవాలి. అప్పుడే కడుపులో బిడ్డ ఆరోగ్యంగా పెరుగుతుంది.
గర్భిణులు టీకాలు తీసుకున్న మూడు వారాల వరకూ కొన్ని సమస్యలు ఎదుర్కోవలసి రావచ్చు. హెపటైటిస్ ఎ టీకా వల్ల తలనొప్పి, అలసట, అరుదుగా తీవ్రమైన అలర్జీ లాంటి సమస్యలు ఎదురౌతాయి. హెపటైటిస్ బి టీకా వల్ల జ్వరం లాంటి సమస్యలు ఏర్పడతాయి. ఇన్ఫ్లూయెంజా టీకా వల్ల రెండు రోజుల జ్వరం, ఎర్రటి వాపు లాంటి సమస్యలు ఏర్పడవచ్చు. టెటనస్ టీకా వల్ల చిన్న పాటి జ్వరం, నొప్పి లాంటివి ఇబ్బంది పెడతారు. రుబెల్లా వ్యాక్సిన్ తీసుకున్న వారికి మెడ గ్రంథుల వాపు, నొప్పులు లాంటివి ఏర్పడవచ్చు. వరిసెల్లా టీకా చిన్న పాటి గడ్డలు, జ్వరానికి కారణం అవుతాయి.
న్యూమోకోకల్ టీకా వల్ల జ్వరం వస్తుంది. ఓరల్ పోలియో టీకా వల్ల పెద్దగా సమస్యలేవీ ఎదురు కావు. కొంత మందిలో మాత్రం శరీరంలో అసౌకర్యంతో పాటు, టీకా ఇచ్చిన చోట ఎర్రబారడం ఏర్పడుతుంది. వైద్యుని సలహా మేరకు అన్ని పరీక్షలు చేసి టీకా ఇస్తారు గనుక, చిన్న పాటి సమస్యలే ఎదురౌతాయి. అయితే సమస్య మరీ ఎక్కువగా ఇబ్బంది పెడుతోంది అనిపిస్తే మాత్రం వెంటనే వైద్యుని సంప్రదించి సరైన చికిత్స తీసుకోవాలి.