వేసవి కాలం వచ్చేసింది. ఫిబ్రవరీ చివరి వారంలోనే ఎండలు మండిపోతున్నాయి. మరి ఈ ఎండవేడి నుంచి తప్పించుకోవడానికి Cooler, AC ల వాడకం, Fridge లో నీళ్ళు తాగడం తప్పనిసరిగా మారిపోతుంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో Asthma, Allergies ఉన్నవాళ్ళు AC, Cooler, Fridge వాడవచ్చునా?
ఏసీ రూముల్లో, ఏసీ కార్లలో బ్యాక్టీరియా నిలవ ఎక్కువ
AC, Cooler, Fridge అలర్జీ, ఆస్తమా వంటి శ్వాస సంబంధ సమస్యలు ఉన్నవారు వాడకపోవడమే మంచిది. ఎందుకంటే వారికి టెంపరేచర్ పడకపోవచ్చు, వాళ్ళలో ఇన్ఫెక్షన్ ఏదైనా ఉండే అవకాశం కూడా ఉంటుంది. ఏసీ రూముల్లో, ఏసీ కార్లలో బ్యాక్టీరియా నిలవ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీని కారణంగా దగ్గుతో బాధపడుతున్నవారు ఏసీలో ఉన్నపుడు దగ్గితే ఆ దగ్గు పక్కవారికి కూడా వచ్చే అవకాశం ఉంది. ఇంతేకాకుండా రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు కూలర్లు, ఫ్రిడ్జ్, ఏసీ లు వాడినపుడు ఇన్ఫెక్షన్ల బారినపడే అవకాశాలు ఎక్కువే అని చెప్పుకోవాలి.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి
కూలర్లు వాడుతున్నపుడు కులర్ లో వాటర్ ఎప్పటికప్పుడు మార్చుతు ఉండాలి, గడ్డి పలకలు (grass pads) క్లీన్ చేస్తూ ఉండాలి. కూలర్ కి గానీ, ఏసీ కి గానీ ఎదురుగా కూర్చోకూడదు. అంతకుముందే దగ్గు ఉండి ఏసీ రూముల్లో లేదా ఏసీ కార్లలో ప్రయాణిస్తున్నపుడు మాస్క్ లు తప్పనిసరిగా ధరించాలి. ఇలా చేయడం ద్వారా ఇన్ఫెక్షన్లకు గురయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాదం ద్వారా Asthma, Allergies ఉన్నవాళ్ళు AC, Cooler, Fridge లను వాడుకోవచ్చు.