మాతృత్వాన్ని మించిన మధురమైన అనుభవం మరొకటి ఉండదు. తల్లి అయ్యే క్రమంలో కడుపులో బిడ్డను ఆ తొమ్మిది నెలలూ పదిలంగా కాపాడుకోవాలి. మరీ ముఖ్యంగా గర్భధారణలో మొదటి మూడు నెలలు ఎంతో కీలకం. అలాగే గర్భం ధరించిన తర్వాత నిద్రలేమితో మహిళలు ఇబ్బంది పడతారు. గర్భిణీకి కలిగే శారీరక, మానసిక ఇబ్బందుల వల్ల నిద్ర విషయంలో సమస్యలు వస్తూ ఉంటాయి.
గర్భంతో ఉన్న స్త్రీలకు ఆనందంతో పాటు ఆందోళన కూడా ఉంటుంది. తల్లికాబోతున్నాననే ఆనందం ఒక వైపు ఉంటే, దానికి సంబంధించిన సమస్యలు వారిని ఒత్తిళ్ళకు గురి చేస్తూ ఉంటాయి. ఫలితంగా గర్భిణీలు నిద్ర లేమికి గురవుతారు. ఈ సమస్య ఇలానే కొనసాగితే వారికి ప్రసవంలో సమస్యలు వస్తాయి.
80 శాతం మంది గర్భిణీలలో నిద్రలేమి
బిడ్డను కడుపులో మోసే నవమాసాల కాలం తల్లికి ఎంతో కీలకమైనది. ఈ సమయంలో ఎదుర్కొనే ప్రతి సమస్య బిడ్డ ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుంది. గర్భిణులకు ఎదురయ్యే సమస్యల్లో దాదాపు 80 శాతం మందిలో నిద్రలేమి కనిపిస్తుంది. ఒకవైపు బాగా అలసిపోయి, నిద్ర వస్తున్నట్లు అనిపిస్తూ ఉంటుంది. కానీ నిద్ర మాత్రం పట్టదు. ఫలితంగా గర్భిణుల్లో అసహనంతో కూడిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఈ సమస్యకు ప్రధానం కాణం గర్భిణుల్లో మొదలయ్యే హార్మోన్ల సమస్యలే.
హార్మోన్లలో వచ్చే మార్పులతో పాటు శారీరక అసమానతల వల్ల ఈ సమస్య ఎదురౌతుంది. గర్భం ధరించిన తర్వాత ప్రతి త్రైమాసికంలో ఈ సమస్య పెరుగుతూనే ఉంటుంది. చివరి మూడు నెలల్లో బిడ్డ కదలికలు పెరగడం వల్ల సరిగ్గా నిద్రపోలేని పరిస్థితి ఏర్పడుతుంది.
గర్భిణుల్లో నిద్రలేమికి ప్రధాన కారణాలు
గాఢ నిద్రలో ఉన్నప్పటికీ కొన్ని సమయాల్లో మేల్కోక తప్పదు. ఒక వైపు నిద్ర, మరో వైపు నిద్ర లేమితో మానసికంగా ఇబ్బంది ఎదుర్కొంటూ ఉంటారు. దీనితో పాటు ఆందోళన పెరగడం వల్ల సమస్యలు ఎదురౌతూ ఉంటాయి. దీనితో పాటు కాళ్ళ తిమ్మిరిల సమస్య కూడా ఇబ్బంది పెడుతూనే ఉంటుంది.
ఒక్కోసారి గాఢ నిద్రలో ఉన్నా వీటి వల్ల మెలకువ వచ్చేస్తూ ఉంటుంది. అదే విధంగా తరచూ మూత్ర రావడం వల్ల కూడా దీని కోసం నిద్ర లేస్తూనే ఉంటారు. పిండం పెరుగుతూ ఉండడం వల్ల రాత్రిళ్ళు ఈ సమస్య ఎదురౌతూ ఉంటుంది. బేబీ బంప్ కూడా ఈ సమస్యను పెంచుతూనే పోతుంది. ఈ సమస్యలకు వీలైనంత వరకూ వైద్యుల సలహా తీసుకుని, సరైన పరిష్కారంతో ఇబ్బందులు తొలగించుకోవాలి.
నిద్రలేమికి కారణమయ్యే అంశాలు
దాదాపు తొమ్మిది నెలల పాటు ప్రతి నెలా ఇలాంటి పరిస్థితి పెరుగుతూనే పోతూ ఉంటుంది. దీని వల్ల సరైన నిద్ర లేక ఆందోళన వల్ల తల్లికి సమస్యలు ఎదురౌతూ ఉంటాయి. ఈ సమస్యలతో పాటు తల్లులు తీసుకునే ఆహారం కూడా నిద్రలేమి సమస్యలు తీసుకురావచ్చు. ఇంట్లో చిన్న పాటి సమస్యలు ఉన్నా, గర్భిణులు ఎక్కువగా ఆలోచించడం వల్ల నిద్ర లేకుండా ఉంటుంది. అప్పటి వరకూ నిద్ర భంగిమలు గర్భం ధరించిన తర్వాత కుదరవు గనుక, ఆ విషయంలోనూ ఇబ్బందిగానే మారుతూ ఉంటుంది.
ఇలాంటి వాటి విషయంలో ఎప్పటికప్పుడు వైద్యుల సంప్రదింపులతోనే సమస్యకు మంచి పరిష్కారం దొరుకుతుంది. గర్భిణులు వీలైనంత వరకూ నిద్రలేమికి కారణమయ్యే అంశాలకు దూరంగా ఉండాలి.
- కాఫీ, టీల వంటివి తీసుకోవడం పూర్తిగా మానుకోవాలి.
- మద్యపానం లాంటి అలవాటు కూడా వదిలించుకోవాలి.
- సోడాతో కూడిన కూల్ డ్రింక్స్ కూడా నిద్రలేమి సమస్యలను పెంచుతాయి.
వాటికి కూడా వీలైనంత వరకూ దూరంగానే ఉండాలి.
నిద్రలేమి సమస్యలకు పాటించాల్సిన జాగ్రత్తలు
రాత్రిళ్లు నిద్ర పోయే ముందు భారీ ఆహారాలు కాకుండా, తేలికగా జీర్ణమయ్యే పోషకాహారాన్ని తీసుకోవాలి. జంక్ ఫుడ్స్ కు పూర్తిగా దూరంగా ఉండడం, మరీ వేడిగా, మరీ చల్లగా తీసుకోకపోవడం లాంటి వాటి ద్వారా కాబోయే తల్లులు నిద్ర లేమి సమస్యల నుంచి పరిష్కారం పొందవచ్చు.
గర్భం బరువు పెరగుతూ పోవడం వల్ల తల్లులు పడుకునేటప్పుడు కాస్తంత ఇబ్బంది గానే ఉంటుంది. కాళ్ళ మధ్యలో దిండు పెట్టి పండుకోవడం ద్వారా మంచి నిద్ర పడుతుంది. అదే విధంగా సాయంత్రాలు గోరు వెచ్చని నీటితో స్నానం కూడా సమస్యలు లేకుండా చూస్తుంది. ఎక్కువ ఆలోచనల వల్ల కలలతో నిద్రంతా కలతగానే ఉంటుంది.
సాయంత్రం గోరువెచ్చని పాలు తీసుకోవడం వల్ల కూడా చక్కగా నిద్ర పడుతుంది.
ధరించే దుస్తుల విషయంలో కూడా కాబోయే అమ్మలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మరీ బిగుతుగా లేదా వదులుగా ఉండే దుస్తులు వాడకూడదు. గర్భం పెరిగే కొలదీ మరింత బిగుతుగా లేని దుస్తులు వాడాలి. ఎక్కడా కడుపులో బిడ్డకు ఇబ్బంది రాకుండా పడుకునే భంగిమ మరింత సౌకర్యవంతంగా ఉండాలి. ఆహారం విషయంలోనూ జాగ్రత్తలు తప్పనిసరి. కొన్ని రకాల మందులు నిద్రలేమికి కారణం అవుతాయి గనుక మరీ ఆలస్యంగా మందులు తీసుకోవడం మంచిది కాదు.
చివరిగా
వైద్యులు సూచించిన సమయానికే మందులు తీసుకోవాలి. సరైన పోషకాహారం తీసుకోవడం వల్ల కూడా మంచి నిద్రను పొందవచ్చు. ఎక్కువగా మూత్ర సమస్యలు ఇబ్బంది పెట్టకుండా, రాత్రిళ్ళు అవసరమైన మేరకే నీటిని తీసుకోవాలి. నిద్ర విషయంలో ఏర్పడే సమస్యలకు ఎప్పటికప్పుడు వైద్యులను సంప్రదించి, పరిష్కారం పొంది, పండంటి బిడ్డను కనవచ్చు.
ఇవి కూడా చదవండి
గర్భంలో బిడ్డ కదలికలు సరిగా లేకుంటే…!
గర్భిణీలకు ఈ మందులు ప్రమాదకరమా?
ఏం తింటే గర్భిణీలలో రక్తం పెరుగుతుంది?
[wpdiscuz-feedback id=”dj9sw9j6ys” question=”Please leave a feedback on this” opened=”0″][/wpdiscuz-feedback]