బీజింగ్ : చైనాని పట్టి పీడిస్తున్న కరోనా వైరస్ రోజురోజుకి అనేకమంది ప్రాణాల్ని బలిగొంటోంది. కరోనా వైరస్ ను అణిచేయడానికి చాలా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. కానీ మృతుల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. ఓ వైపు మరణిస్తున్న వారి సంఖ్య మరో వైపు వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. ఒక శనివారమే 89 మంది ఈ వైరస్ తో పోరాడుతూ ప్రాణాల్ని కోల్పోయారు. వీరిలో 81 మంది వైరస్ కు కేంద్రంగా ఉన్న హుబై ప్రావిన్సుకు చెందినవారై ఉండటం పరిస్తితి తీవ్రతకు అద్దం పడుతోంది. దీంతో మరణించిన వారి సంఖ్య 811కు చేరిందని వార్తలు వస్తున్నాయి. గతంలో సార్స్ బారిన పడి ప్రపంచవ్యాప్తంగా మరణించిన వారికంటే ఈ సంఖ్య ఎక్కువగా ఉండటం తీవ్ర అందోళనకు గురిచేస్తోంది. 2002 – 2003 మధ్య ప్రపంచాన్ని విలవిలలాడించిన సార్స్ వైరస్ 774 మందిని బలిగొంది.