మనం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాం. ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులని మనం ఇంతకుముందు కూడా చవి చూశాం. ఎప్పటిలాగే దేశ ప్రజల పూర్తి సహాయ సహకారాలు దేశానికి అందుతున్నాయి. దానికి పూర్తిగా నా ధన్యవాదాలు. ఈ యుద్దంలో మీరు ఒక్కరే లేరు. మీతో పాటు మీ పొరుగింటివారు, మీ స్నేహితులు, మీ బాధువులు, మీ ప్రాంత ప్రజలు, యావత్ దేశ ప్రజలు మొత్తం మీకు అండగా ఉన్నారు. ఈ క్రమశిక్షణతోనే మన చుట్టూ అలుముకున్న కరోనా వైరస్ అనే మహమ్మారిని దానివలన సంభవించిన చీకటిని మనం పారద్రోలాలి. ఈ చీకట్లోంచి మనం వెలుగులోకి రావాలి.
Youtube – Naredramodi’s Call
ఆ వెలుగుని చూసి కరోనా మహమ్మారి పారిపోవాలి. అది జరగాలంటే దేశ ప్రజలందరూ ఏప్రిల్ 5వ తేదీన రాత్రి 9గం.లకు సరిగా తొమ్మిది నిమిషాలపాటు మీ ఇంట్లో లైట్లను అర్పేసి కొవ్వొత్తిని గానీ, దీపాన్ని గానీ, మీ మొబైల్ లో లైట్ ని వెలిగించాలి. ఆ కాంతిని మీరు తరువాతి 9 నిమిషాల పాటు ప్రసరింపజేయాలి. ఈ కాంతితో మనం మంతా ఒక్కటిగా ఉన్నాం అనే సందేశం ప్రపంచమంతా తెలియజేయాలి. ఈ కఠిన సమయంలో మనమందరం ఏకమవ్వడం మన కనీస బాధ్యత. ఈ సమయంలో ఎవ్వరూ కూడా గుంపులుగా చేరకూడదు. సోషల్ డిస్టెన్స్ ను మనమందరం పాటిస్తూనే మన ఇళ్ళల్లో కాంతి వెలగాలి. మీరు ఇంకొక్క 12 రోజులు మీ ఇళ్లలోనే గడపాలని దానికి మీరందరూ సహకరించాలని కోరుతున్నాను.