స్త్రీలకు ప్రతి నెలా పీరియడ్స్ రావడమనేది సాధారణమే. పీరియడ్స్ సమయంలో ఏ సమస్యలు లేనంత వరకు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయితే నెలసరిలో జరిగే కొన్ని మార్పులు పీరియడ్ సమస్య లకు సిగ్నల్స్.
period problems in women
బ్లీడింగ్ ఎక్కువ రోజులున్నా, తక్కువ రోజులున్నా
సాధారణ పీరియడ్ సైకిల్ నాలుగు నుంచి ఏడు రోజుల మధ్య ఉంటుంది. ఈ రోజుల్లో బ్లీడింగ్ అవుతుంది. కొందరికి బ్లీడింగ్ రెండు రోజులే అవుతుంది. కొంతమందికి ఏడు రోజుల తర్వాత కూడా బ్లీడింగ్ అవుతుంది. ఈ రెండు కండీషన్స్ తరచుగా జరుగుతూ ఉంటే కంగారు పడాల్సిన విషయమే. వెంటనే డాక్టర్ను సంప్రదించాలి.
సైకిల్ పెరిగినా, తగ్గినా
ప్రతి మహిళకు నెలసరి మధ్య రోజులు ఒకేలా ఉండవు. కానీ సాధారణంగా 24 – 38 రోజుల మధ్య ఉంటుంది. నెలసరి 24 రోజులకు ముందుగా వచ్చేస్తున్నా 38 రోజులు దాటినా పీరియడ్ రాకపోతుంటే ఆందోళన పడాల్సిన విషయమే.
బ్లీడింగ్ ఎక్కువ అవుతున్నా
నెలసరి సమయంలో అందరికీ బ్లీడింగ్ ఒకేలా అవ్వదు. కొంతమందికి ఎక్కువగా, కొందరికి తక్కువగా అవుతూ ఉంటుంది. ఒకవేళ ప్రతి 3 గంటలకు ఓ ప్యాడ్ లేదా టాంపాన్లు తడిచిపోతుంటే భయపడాల్సిన విషయమే. హెవీ బ్రీడింగ్ సమస్యతో బాధపడుతున్న మహిళలకు అలసట, రక్తహీనత, శ్వాస ఆడకపోవడం వంటి సమస్యలతో బాధపడుతుంటారు. ఇది సాధారణం కాదు.
గడ్డలు పడుతుంటే
పీరియడ్స్ సమయంలో రక్తం గడ్డలుగా పడటం సాధారణమే. ఒకవేళ గడ్డలు మరీ పెద్దగా ఉంటే ఏదో సమస్య ఉందని అనుమనానించాల్సిందే. ఈ రక్తం గడ్డల సంఖ్య ఎక్కువైనా, సైజ్ పెద్దగా ఉన్నా డాక్టర్ను కలవడం మంచిది.
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.