Summer heat

పిల్లలకు వడదెబ్బ తగిలితే ?

ఎండాకాలం ఎవరైనా జాగ్రత్తగానే వుండాలి. కానీ పిల్లల్ని మరింత జాగ్రత్తగా చూసుకోవాలి. శరీర ఉష్ణోగ్రతను నియంత్రించే కేంద్రం పిల్లల మెదడులో చాలా బలహీనంగా ఉంటుంది. అందుకే వడదెబ్బ తగిలే అవకాశాలు పెద్దల్లో కంటే పిల్లల్లో ఎక్కువగా ఉంటాయి.

Procrastination

పనులను వాయిదా వేస్తున్నారా? ఆ గుణాన్ని ఇలా వదిలేయవచ్చు

ఒక విష‌యాన్ని విశాల‌మైన దృక్ప‌థంతో చూడ‌టం వలన మ‌నం వాయిదా వేయ‌కుండా ప‌నులు చేయ‌గ‌లం అంటారు నిపుణులు.

How to Improve Intelligence in Children?

మీ పిల్లల్లో తెలివితేటలు పెరగడం లేదా?

పిల్లల్లో ‘‘స్థిర మానసిక స్థితి’’, ‘‘ఎదిగే మానసిక స్థితి’’ అనే మానసిక స్థితులను మనం గమనించొచ్చు. ఫిక్స్‌డ్ మైండ్‌సెట్ ఉన్న పిల్లలు ఏదైతే బాగా చేయగలమో అదే చేస్తారు. గ్రోత్ మైండ్‌సెట్ ఉన్న పిల్లలు కొత్త సవాళ్లను ఎదుర్కోవడానికి ఇష్టపడతారు.

Breast Food

బ్రెస్ట్ (రొమ్ము) ఆరోగ్యం కోసం మంచి ఆహారం

మహిళలు రొమ్ము క్యాన్సర్ బారిన పడకుండా కాపాడుకునే క్రమంలో తృణ ధాన్యాలను కూడా ఎక్కువగా తినటం మంచిది. వీటిలో ఉండే మొక్కల సంబంధిత రసాయనాలకు బ్రెస్ట్ క్యాన్సర్ ని నివారించే శక్తి ఉంది.

Overian Cancer

“ఒవేరియన్ క్యాన్సర్” ముందుగానే గుర్తించండి ఇలా !!

ఒవేరియన్ క్యాన్సర్ లక్షణాలు తొలిదశలో అంతగా కనిపించవు. ఒక్కోసారి వ్యాధి తీవ్రదశకు చేరుకునే వరకు దానిని గుర్తించే అవకాశం ఉండదు. దీని లక్షణాలు సాధారణంగా తరచుగా వచ్చే అనారోగ్యాల్లా అనిపించడం వలన అలా జరుగుతుంది. దీని గురించి తెలుసుకుంటే… లక్షణాలను పసిగట్టి తొలిదశలోనే స్పందించే అవకాశం ఉంటుంది.

Aggressive Children

పిల్లలు మొండిగా ఉండడం వారి ఎదుగుదలలో భాగమేనా?

మొండితనం అనే సమస్యకు అనేక కారణాలు ఉండవచ్చు. ఇలాంటి పిల్లల్లో మానసిక సమస్యలకు ఆస్కారం ఉంటుంది. అతిగా గారాబం చేయడం కూడా పిల్లల్లో మొండితనాన్ని పెంచేస్తాయి.

PMJAY - Health Card

Ayushman Bharat – PMJAY : 5 లక్షల రూపాయల హెల్త్ కార్డు ఉచితం… మీ కార్డు డౌన్‌లోడ్ చేసుకున్నారా?

పీఎంజేఏవై పథకం కవరేజ్ కింద రోగిని మూడురోజుల ముందు ఆస్పత్రిలో చేర్చడంతోపాటు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన తర్వాత 15 రోజుల పాటు చికిత్సకు అయ్యే ఖర్చులు కూడా కేంద్రమే భరిస్తుంది.

Medicine during Pregnancy

Medicine during Pregnancy: గర్భిణీలు వైద్యుల సలహా లేకుండా ఈ మందులు వాడకూడదు.

గర్భిణులకు వందశాతం సురక్షితం అనదగ్గ మందులు ఏమీ లేవని గుర్తుంచుకోవాలి. వారు ఎలాంటి మందులను, సప్లిమెంట్లను, థెరపీలను వాడాలన్నా వైద్యుల సలహా తీసుకోవాల్సి ఉంటుంది. ఒక గర్భిణికి ఉపయోగపడ్డాయి కదా అని మరొకరు అవే మందులను, పద్ధతులను వాడటం కూడా మంచిది కాదు. ఎవరి శరీర తీరు, ఆరోగ్య స్థితిని బట్టి వారికి ప్రత్యేకంగా వైద్య సలహాలు అవసరం అవుతాయి.

Hypothyroidism in newborn babies

“పిల్లల్లో హైపోథైరాయిడిజం” గుర్తించకపోతే ఇబ్బందులే !

థైరాయిడ్ లోపం అనగానే అదేదో పెద్ద సమస్య అనుకుంటాం. కానీ ఇది పిల్లల్లో పుట్టుకతోనూ రావచ్చు. వీలైనంత తొందరగా గుర్తిస్తే ఇది చిన్న సమస్యే, సులువుగానే అదుపు చేయవచ్చు. గుర్తించకపోతేనే ఇది పెద్ద సమస్యగా మారుతుంది. పిల్లలు జీవితాంతం దీని పర్యవసనాలను అనుభవించాల్సి ఉంటుంది.

Anemia in children

పిల్లల్లో రక్తం తక్కువైతే….?

మన శరీరంలో ఉండాల్సిన దానికంటే రక్తం తక్కువగా ఉండటం. పిల్లల విషయంలో ప్రతి 100 గ్రాముల రక్తంలో 12 గ్రాముల హిమోగ్లోబిన్ ఉండాలి. అయితే చాలామంది పిల్లల్లో హిమోగ్లోబిన్ విలువలు బాగా తక్కువగా ఉంటున్నాయి.

Gestational Hypertension

గర్భిణీలలో అధిక రక్తపోటుని అదుపు చేయడం సాధ్యమేనా?

మామూలు రక్తపోటు కంటే గర్భిణీల రక్తపోటు చాలా జాగ్రత్తగా గమనించాల్సిన విషయం. మరీ ముఖ్యంగా 20 వారాలు దాటిన తరువాత రక్తపోటులో మార్పు మితిమీరి ఉంటే ఖచ్చితంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఏమరుపాటుగా ఉంటే గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, మూత్రపిండాల వంటి కీలకమైన అవయవాలు దెబ్బతిని ప్రాణాంతకంగా మారవచ్చు.

Infertility – IVF Procedure

ఐవిఎఫ్ ద్వారా పిల్లల్ని కనడం ఎంతవరకు సాధ్యం?

ఏ కారణం వల్లనైనా సంతానం కలగని వారు కుంగిపోవాల్సిన అవసరం లేకుండా అందుబాటులోకి వచ్చిన చికిత్సా విధానం ఐవిఎఫ్. మిగిలిన పద్ధతులేవీ ఫలితం ఇవ్వనప్పుడే ఈ విధానానికి వెళ్ళటం మంచిదన్నది డాక్టర్ల సూచన.

Obesity and Infertility

అధిక బరువు: ఆడవాళ్ళలో సంతానలేమికి అసలు కారణం

ఇప్పటివరకూ మనం స్థూలకాయం వలన గుండె సంబంధమైన వ్యాధులు, మధుమేహం, కీళ్ళనొప్పుల వంటి సమస్యలే ఎక్కువగా వస్తాయనుకున్నాం. కానీ మితిమీరిన బరువు ఉంటే గర్భధారణ సైతం అసాధ్యమని తేలటంతో దీన్ని చాలా కీలకమైన సమస్యగా గుర్తించాల్సిన అవసరమొచ్చింది.

How to get pregnancy early

పిల్లల్ని త్వరగా కనాలనుకుంటున్నారా? అయితే ఇవి పాటించండి

రోజూ సంభోగించటం వల్ల మాత్రమే గర్భధారణ జరుగుతుందనుకోవటం సరికాదు. అండం విడుదలయ్యే సమయమే చాలా కీలకం. సంభోగం తరువాత వీర్యకణం 72 గంటలపాటు సజీవంగా ఉంటుంది. అదే విధంగా పిల్లల్ని కనాలనే వత్తిడికి లోను కావటం కూడా మంచిది కాదు.

Hidden causes of laziness

బ‌ద్ద‌కం ఎంత అస‌హ్య‌క‌ర‌మైన‌దో తెలుసా?

అస‌లు ప‌నే చేయ‌బుద్ది కాక‌పోవ‌టం ఒక‌ర‌కం బ‌ద్ద‌కం అయితే కొంత‌మందికి కొన్ని ర‌కాల ప‌నులు చేయాలంటే బ‌ద్ద‌కంగా ఉంటుంది. మిగిలిన ప‌నులు చేస్తున్నా ఆ ప‌నుల‌ను మాత్రం వాయిదా వేస్తుంటారు. అలాగే కొన్నిసార్లు వృత్తిప‌ర‌మైన ప‌నుల్లో బాగా అల‌సిపోయి ఇంటికి వ‌చ్చాక బూట్లు విప్ప‌టానికి కూడా బ‌ద్ద‌కించేవారు ఉంటారు.

Scroll to Top
Scroll to Top