‘ఇదంతా ఒక ఏడు నుంచి ఎనిమిది రోజుల్లోనే జరిగిపోయింది. ఈ బాధని తట్టుకోలేకపోతున్నా’ అంటూ జూనియర్ ఆంథోనీ ఫ్రాంక్లిన్ రోధిస్తున్నారు.
అమెరికాలోని లూసియానా రాష్ట్రానికి చెంది 86 సం.ల వృద్ధురాలితో పాటు, ఆమె ముగ్గురు కొడుకులకు కరోనా కూడా పాజిటివ్ వచ్చింది. అయితే వారందరికి చికిత్స జరుగుతూనే ఉంది. వీరందరికీ వ్యాధి తీవ్రత ఎక్కువై ఒక ఏడెనిమిది రోజుల వ్యవధిలోనే ఒక్కొక్కరుగా ప్రాణాలు విడిచారు. ఈ సంఘటనని కరోనర్స్ ఆఫీసు వారు మరియు, చనిపోయిన వారి బంధువులు దృవీకరించారు.
ఇవి కూడా చదవండి:
- “రామాయణం – 2020”: టెలివిజన్ చరిత్రలోనే రికార్డు
- నాకు కృత్రిమ శ్వాస అక్కర్లేదు, ఈ వెంటిలేటర్ తో నాకంటే చిన్న వాళ్ళను బతికించండి!
ఆంటోయ్నెట్టి ఫ్రాంక్లిన్ స్థానికంగా న్యూ ఒర్లియన్స్ లో నివశిస్తున్న స్త్రీ. ఆమె మార్చి నెల 23 వ తేదీన కోవిడ్ వ్యాధి కారణంగా మరణించారు. ఆమె ముగ్గురు కొడుకులు హెర్మన్ ఫ్రాంక్లిన్ 71, ఆంథోనీ ఫ్రాంక్లిన్ 58, టిమోతీ ఫ్రాంక్లిన్ 61. ఈ ముగ్గురు మార్చి 20 నుంచి 30 తేదీలలో మరణించారని న్యూ ఒర్లియన్స్, కరోనర్స్ ఆఫీసు స్పోక్స్ పర్సన్ తెలియజేశారు.
86 సంవత్సరాల ఆంటోయ్నెట్టి ఫ్రాంక్లిన్ ఆమె ముగ్గురు కొడుకులు ఆఫ్రికన్ అమెరికన్లు. లూసియానా రాష్ట్రాన్ని కరోనా పాజిటివ్ కేసుల విషయంలో హాట్ స్పాట్ గా గుర్తించారు. ఆ రాష్ట్రంలో 16, 284 పాజిటివ్ కేసులు నమోదు కాగా 582 మంది మరణించారు.
ఇవి కూడా చదవండి:
- ఇక చాలు మీ సేవలు: భారీ మూల్యం చెల్లించుకుంటున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగులు
- తెలంగాణ నిర్మల్ లో కొత్త కరోనా కేసు
- బేబీ బ్రీచ్ పొజిషన్ లో ఉంటే నార్మల్ డెలివరీ అవుతుందా?