గర్భిణుల్లో పదిశాతం మంది వరకూ అనుకోని దురదల సమస్యను ఎదుర్కొంటూ ఉంటారు. వీటికి ఏ విధమైన సంకేతాలు లేకపోయినా, ఉన్నట్టుండి ఎదురయ్యే ఈ సమస్య బాగా చిరాకు కలిగిస్తూ ఉంటుంది. దీనికి పరిష్కార మార్గం ఏమిటో తెలియక గర్భిణులు బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు. వారు వాడే మందులు మొదలుకుని, మానసిక ఒత్తిడి వరకూ అనేక కారణాల వల్ల ఎదురయ్యే ఈ సమస్యకు ఎలాంటి పరిష్కారాలు ఉన్నాయో తెలుసుకుందామా.
దురదలకు దారి తీసే కారణాలు
గర్భధారణ తర్వాత సాధారణంగా ఎదురయ్యే సమస్యల్లో దురదలు కూడా ఒకటి. శరీరంలో జరుగుతున్న మార్పులు కావచ్చు, కొత్తగా తీసుకుంటున్న మందులు కావచ్చు. మానసికంగా ఎదురయ్యే ఇబ్బంది కావచ్చు, దురదలకు దారి తీస్తాయి. ముఖ్యంగా మందులు విషయానికి వస్తే కొన్ని రకాల
- రక్తపోటు మందులు
- గుండె లయ సమస్యలకు సంబంధించిన మందులు
- ఉబ్బరం నుంచి ఉపశమనం అందించేవి,
- ఈస్ట్రోజెన్
- శస్త్ర చికిత్స సమయంలో ఉపయోగించే హైడ్రోక్సీథైల్ సెల్యులోజ్
లాంటి కొన్ని రకాల మందులు దురదలను ప్రేరేపిస్తాయి. సాధారణంగా అనారోగ్యంగా ఉన్నప్పుడు నాడీ వ్యవస్థ కాస్తంత చిరాకుకు గురైనప్పుడు, దురదలాంటి సమస్యలు ఎదురౌతాయి. సాధారణంగా ఎటువంటి దద్దుర్లు లేకపోతే ఈ సమస్యను పట్టించుకోవలసిన అవసరం లేదు. మెదడు చర్మంలోని నరాలకు దురద సంకేతాన్ని పంపవచ్చు. ఫలితంగా దురద ఏర్పడవచ్చు.
- మల్టిపుల్ స్క్లేరోసిస్
- మెదడు స్ట్రోక్
- కణితి
- నరాల సమస్యలు
మానసిక సమస్యలు కూడా
లాంటివి కూడా దురదలకు కారణం కావచ్చు. మానసిక ఒత్తిడి, ఆందోళన, అబెస్సివ్ కంపల్సివ్ డిజార్డర్, సైకోసిస్, ట్రికోటిల్లోమానియా లాంటి మానసిక సమస్యలు కూడా దురదలకు కారణం కావచ్చు. సాధారణంగా కాబోయే తల్లులు భవిష్యత్ ఆలోచనలతో ఎదుర్కొనే ఒత్తిడి దీనికి దారి తీస్తుంది. కొంత మంది దద్దుర్లు లేకపోయినా, తమ మానసిక పరిస్థితి ద్వారా విపరీతంగా శరీరాన్ని గోకుతూ ఉంటారు. ఇది చర్మ సమస్యలకు దారి తీయవచ్చు. ఇతర ఎలాంటి సమస్యలు లేవంటే కొన్ని సమయాల్లో దురద అనారోగ్య సంకేతాలు కూడా కావచ్చు. అంటే
- కిడ్నీ సమస్యలు
- కాలేయవ్యాధి
- థైరాయిడ్ సమస్యలు
- కొన్ని రకాల క్యాన్సర్లు
- మధుమేహం
- ఐరన్ లోపం
- హెచ్ఐవి
ఫంగల్ ఇన్ఫెక్షన్లు కూడా
లాంటి సమస్యలు ఉన్న వారిలో కూడా దురద ఒక రకమైన సంకేతం కావచ్చు. గర్భధారణ తర్వాత శరీరంలో జరిగే కొన్ని రకాల మార్పుల కారణంగా ఆయా వ్యాధులు తమ సంకేతాలను బయటకు చూపిస్తాయి. ఇలాంటి వాటి ద్వారా కూడా దురదలు ఎదురు కావచ్చు. అలాగే దురదలతో పాట దద్దుర్ల సమస్య కూడా కనిపించిందంటే దాన్ని ఓ రకమైన ఫంగల్ ఇన్ఫెక్షన్ గా గమనించవచ్చు. గతంలో ఏదైనా అలర్జీల చరిత్ర ఉందేమో తెలుసుకుని, ఈ సమస్యకు మందులు వాడడం ద్వారా దురద సమస్యను తగ్గించుకోవచ్చు.
గర్భిణుల్లో దురద సంబంధ లక్షణాలు ఎదురైనప్పుడు ముందుగా ఆ సమస్య ఏ కారణాల వల్ల ఎదురైందనే విషయాన్ని గమనించాలి. సాధారణంగా చర్మం సంబంధ సమస్యల వల్లగానీ, దద్దుర్ల వల్ల గానీ అయితే దీనికి లేపనాలు వాడడం, బట్టల ద్వారా వచ్చే సమస్యలను గుర్తించి మార్పులు చేసుకోవడం లాంటివి చేయవచ్చు.
ఈ జాగ్రత్తలు పాటించాలి
అలాగే వివిధ వ్యాధులకు సంబంధించిన లక్షణాల వల్ల అయితే మాత్రం కచ్చితంగా వైద్యుని సంప్రదించి, సంపూర్ణ చికిత్సను తీసుకోవాలి. మరికొందరిలో మందుల ద్వారా ఈ సమస్య ఎదురౌతుంటే ఆ విషయాన్ని వైద్యునికి తెలియజేసి అవసరమైన మేరకు మందుల్లో కావలసిన మార్పులు ఏమిటో తెలుసుకోవాలి.
అలాగే మానసిక ఒత్తిడి మాత్రం ఈ సమస్యకు కారణమైతే, దీని పరిష్కారం వారి చేతిలోనే ఉంటుంది. ఒత్తిడిని తగ్గించుకోవడం, సమతుల ఆహారాన్ని తీసుకోవడం, సరైన వైద్య సలహాలు పాటించడం లాంటి జాగ్రత్తల ద్వారా దురద సమస్యల నుంచి పరిష్కారం పొందవచ్చు.