శృంగార జీవితం మెదడు మీద ప్రభావాన్ని చూపిస్తుందా? శృంగార జీవితం ఆశాజనకంగా లేని వ్యక్తుల్లో భవిష్యత్తులో జ్ఞాపకశక్తి లోపించవచ్చా?
అవునననే చెబుతున్నారు మధ్య వయసు వ్యక్తులపై రీసెర్చి చేసిన పెన్ స్టేట్ శాస్త్రవేత్తలు.
పురుషులలో అంగస్తంభన పనితీరు, లైంగిక సంతృప్తి మరియు జ్ఞాపకాశక్తి మధ్య సంబంధాలపై ఈ అధ్యయనం జరిగింది. లైంగిక సంతృప్తి మరియు అంగస్తంభన పనితీరు సరిగా లేకపోతే భవిష్యత్తులో జ్ఞాపకశక్తి లోపించవచ్చని పరిశోధకులు కనుగొన్నారు.
ఈ అధ్యయనం వియత్నాం ఎరా ట్విన్ స్టడీ ఆఫ్ ఏజింగ్లో పాల్గొన్న 818 మంది పురుషుల నుండి డేటాను సేకరించింది. ఈ అధ్యయనంలో పాల్గొన్నవారి వయసు 56 నుండి 68 సంవత్సరాలు. వారి జీవితంలో గడిచిన 12 సంవత్సరాల కాలానికి సంబంధించిన వివరాల ఆధారంగా ఈ సర్వే చేయబడింది. పరిశోధకులు ఈ సంవత్సరాల్లో వారి జీవిత అనుభవాల ఆధారంగా వారి జీవితంలో మార్పులను అధ్యయనం చేశారు. కాలక్రమేణా వ్యక్తుల జ్ఞాపకశక్తి మరియు లైంగిక పనితీరు కలిసి ఎలా మారతాయో పరిశోధకులు విశ్లేషించారు.