సినిమా చరిత్ర చాలా గొప్పది చాలా పెద్దది. మొదట సినిమాలను థియేటర్ లో చూసేవాళ్లం, ఆ తరువాత టీవీల్లో, ఇప్పుడు ఇంట్లోనే అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ వంటి ప్రైవేట్ మాధ్యమాల్లో చూస్తున్నాం. అయితే సినిమాలను ఇంట్లో చూడటం కంటే థియేటర్లలలో చూసే మనం ఎక్కువగా ఎంజాయ్ చేసేవాళ్లం. మొదట 35mm, 70mm స్క్రీన్లు ఉండేవి ఆ తరువాత మల్టీ ప్లెక్స్ లు అందుబాటులోకి వచ్చాయి. తక్కువ సీటింగ్ కెపాసిటీ తో ప్రేక్షకులు సినిమాలను బాగానే ఎంజాయ్ చేసేవాళ్ళు.
అయితే కరోనా మహమ్మారి కారణంగా సినిమా సీన్ రివర్స్ కాబోతోందా? అనే అనుమానాలు పెరుగుతున్నాయి. ఎందుకంటే కరోనా వైరస్ వచ్చి మన లెక్కలను తారుమారు చేసింది. మన ఆలోచనలను, మన జీవనశైలిని కంట్రోల్ లో పెట్టుకోమని హెచ్చరికలు చేసింది. ఈ నేపథ్యంలో మనం సోషల్ డిస్టన్స్ అనే ఒక కొత్త పదాన్ని పదే పదే వింటున్నాం. అంటే మనిషికి మనిషికి మధ్య కనీసం ఒక మీటరు దూరం తప్పనిసరి. లేకపోతే కరోనా సోకే అవకాశాలు ఎక్కువ.
మరి థియేటర్లో సినిమా చేసే వాళ్ళు ఒక మీటరు దూరం పాటిస్తూ కలిసి సినిమా చూడటం అనేది ఎంతవరకు సాధ్య పడుతుంది? అసలు ఇది జరిగే పనేనా? మరి ఈ విషయంలో థియేటర్ యాజమాన్యాలు ఏమాలోచిస్తున్నాయి? ఒకవేళ థియేటర్లో సినిమా చూడటం కుదరకపోతే, ప్రభుత్వాలు అందుకు పర్మిషన్ ఇవ్వకపోతే, సినిమాల పరిస్థితి ఏంటి? నేట్టింట వెలసిన అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ వంటివే కొత్త సినిమాలను వీక్షించడానికి ప్రత్యామ్నాయాలుగా మారబోతున్నాయా? అంతేకాకుండా ఇక మనం కరోనా వైరస్ తో సహవాసం చేయాల్సిందేనని మేధావులు, డాక్టర్ లు, ప్రభుత్వాలు కూడా ఒప్పుకుంటున్నాయి. ఈ సందర్భంలో సినిమాల పరిస్థితి ఏంటి?