సమస్య:
నేను టీచర్ గా పని చేస్తున్నాను. మా వారు ఒక ప్రయివేటు కంపెనీలో పెద్ద హోదాలో పనిచేస్తున్నారు. మావారికి… తనతో పాటు పనిచేస్తున్న ఒక మహిళతో సంబంధం ఉందని నాకు తెలిసింది. తనని అడిగి గొడవ చేశాను. నిజమేనని ఒప్పుకున్నాడు. ఇకనుండి ఆమెకి దూరంగా ఉంటానని పిల్లలపైన ఒట్టువేశాడు. మాకు 13,11 ఏళ్ల వయసున్న ఇద్దరు ఆడపిల్లలున్నారు. సమాజంలో గౌరవంగా బతుకుతున్నాం, ఇప్పుడు తన విషయం బయటపడితే బంధువుల్లో కూడా తలెత్తుకోలేము. అందుకే మౌనంగా ఉన్నాను కానీ…నా భర్తని క్షమించలేకపోతున్నాను. తను కళ్లముందు కనబడితే చాలు ఏదో ఒక మాట అనకుండా ఉండలేకపోతున్నాను. మనసులో ఎప్పుడూ దిగులుగా ఆందోళనగా అసహనంగా ఉంటోంది. పిల్లలకు సరిగ్గా చదువు చెప్పలేకపోతున్నాను…దయచేసి ఈ నరకం నుండి బయటపడే మార్గమేదన్నా చెప్పండి. – శారద, ములుగు
సలహా:
మీ భర్త చేసింది అక్షరాలా తప్పే కానీ జీతంలో కొన్ని పొరపాట్లు జరిగిపోతుంటాయి. ఈ విషయం గురించి మీరు చాలా ఎక్కువగా అల్చిస్తున్నారు అనిపిస్తుంది. ఈ రోజుల్లో చాలా కుటుంబాల్లో ఇలాంటి సంఘటనలు జరుతూనే ఉన్నాయి. మారుతున్న జీవనశైలి, టెక్నాలజీ పెరిగిపోవడం, కమ్యూనికేషన్ ఈజీ అయిపోవడం ఇవన్నీ మనుషుల్ని ఇలాంటి పరిస్థితులకు దోహదం చేస్తున్నాయి.
జరిగిపోయినదానికి బాధపడటం తప్ప మీరేమీ చేయలేని నిస్సహాయ పరిస్థితుల్లో ఉన్నారు. ఎందుకంటే మీకు పిల్లలున్నారు, కుటుంబం ఉంది. ఇలాంటి విషయాలు బయటికి తెలిస్తే మన పరువే పోతుంది. అందులోనూ మీకున్నది ఇద్దరు ఆడపిల్లలు.
అంటే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి మీ భర్త ఏంచేసినా మీరు భరించాలి అన్నది ఇక్కడ నా ఉద్దేశం కాదు. మీకు అనుమానం వచ్చి మీరు ఆయనని నిలదీశారు. మీ భర్త తన తప్పు తెలుసుకున్నాను ఇంకోసారి ఇలాంటి తప్పు చేయను అని మీ పిల్లల మీద కూడా ఒట్టు కూడా వేశారు అంటున్నారు.
అందుకని మీరు మీ భర్త చేసిన తప్పుని క్షమించడమే మంచిది. లేదు నేను ఇంకా ఆయన మీద కోపంగా ఉంటాను, మాటలు అంటాను అంటే ఇక రోజూ మీ ఇంట్లో గొడవలే అవుతాయి. రోజూ అనీ అనీ ఆయన మనసుని ఇంకా గాయపరిచి మీ ఇద్దరి మధ్యా పెద్ద అఘాదాన్ని సృష్టించడం మీ ఇద్దరి జీవితాలకు మంచిది కాదు. ఇద్దరికీ మనఃశాంతి ఉండదు.
అసలు మీ భర్త మీకు దూరంగా ఎందుకుంటున్నారు, ఆయనకు అలాంటి ఆలోచన ఎందుకొచ్చింది? మీరు ఆయనకు ఇవ్వాల్సిన ఆనందం, సంతోషం ఇస్తున్నారా లేదా అనేది మీరు కూడా ఒకసారి ఆలోచించుకోండి, ఆత్మ విమర్శ చేసుకోండి.
అన్నీ మర్చిపోయి ఆయనకిచ్చే గౌరవం, మర్యాద ఆయానికిస్తే మీ భర్త మీ దగ్గరే ఉంటారు. అలా కాకుండా రోజూ ఏదో ఒక గొడవ చేస్తే మాత్రం ఆయన ఆలోచనలు కూడా మారిపోతాయి. అది మీ పిల్లల భవిష్యత్తుని దెబ్బతీస్తుంది. ఎవరికైనా తెలిస్తే పరువు పోతుంది, వాళ్ళు అలా అంటారు, వీళ్ళు ఇలా అంటారు అందుకే మౌనంగా ఉన్నాను. అనే ఆలోచనలు మానేసి మీ భర్తని మనస్ఫూర్తిగా క్షమించండి.
ఏదిఏమైనా మీ కాపురాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మీ ఇద్దరి మీదా ఉంది. కనుక ఇద్దరూ కూర్చుని మాట్లాడుకొని ఒకరిని ఒకరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. లేదా ఒక ఫామిలీ కౌన్సెలర్ కలిసి ఆయన సలహా తీసుకోండి. మీ సంసారాన్ని, మీ కుటుంబాన్ని కాపాడుకోండి.
[wpdiscuz-feedback id=”a8vj6p2ti8″ question=”Please leave a feedback on this” opened=”0″][/wpdiscuz-feedback]