మంచి ఆరోగ్యానికి నిద్ర చాలా అవసరమంటారు.రాత్రంతా నిద్ర లేనివాళ్లు అధిక రక్తపోటుకు గురయ్యే ప్రమాదముంది. నిద్ర కోసం కొన్ని చిట్కాలు తెలిస్తే కమ్మటి నిద్ర మీ సొంతమవుతుంది.
నిద్ర అనేది మనిషికి దేవుడిచ్చిన వరం. కానీ నేడు చాలామంది సరైన నిద్ర లేకపోవడం వల్ల అనేక రకాల సమస్యలను కొనితెచ్చుకుంటున్నారు. నిద్ర కు భంగం కలిగించే వాటిలో మొబైల్ ఫోన్ ఒకటి. ఇందులో ఉండేబ్లూ లైట్ అనేది అత్యంత ప్రమాదకరమైంది. నిత్యం మన చేతుల్లో ఉండే సెల్ ఫోన్, టాబ్లెట్ లలో బ్లూ లైట్ ఉంటుంది. ఈ బ్లూ లైట్ వల్ల మన శరీరం మీద దుష్పరిణామాలు సంభవించడానికి ఆస్కారముంది.
అందుకే రాత్రి పడుకోవడానికి అరగంట ముందే బ్లూ లైట్లన్నీ ఆపివేయాలి.
రాత్రిపూట సరిగ్గా నిద్రపట్టడానికి పగటిపూట కూడా నిద్రపోవాలి. పగటిపూట 20 నిమిషాలకు మించి నిద్రపోకూడదు.
చిన్న చిన్న కునుకుపాట్లు తీయడం వల్ల రోజంతా ఫ్రెష్ గా ఉండొచ్చు.
మద్యాహ్న వేళల్లో నీరసంగా అనిపిస్తే కొద్దిదూరం నడక, గ్లాసు చల్లటి మంచినీళ్లు తాగడం, స్నేహితుడితో ఫోన్లో మాట్లాడటం మంచిది. ఇలా చేయడం వల్ల నిద్ర పట్టడానికి అవకాశం ఉంది.
నడుము క్రిందిభాగంలో నొప్పిగా అనిపిస్తే అంత త్వరగా నిద్ర పట్టదు. ఒకవేళ నిద్ర పట్టినా కొద్దిసేపటికే మెలకువ వస్తుంది. గాఢనిద్ర అనేది ఉండదు. దీంతో విశ్రాంతి ఉండదు. ఈ సమయంలో ఒక చిట్కా పాటించాలి.
రెండు కాళ్ల క్రింద నడుము క్రింది భాగంలో నొప్పి తగ్గడానికి దిండు పెట్టుకోవాలి. మీరు నిద్రపోయినప్పుడు నడుము క్రింది భాగంలో, మోకాళ్ల మధ్య దిండు పెట్టడం వల్ల ఉపశమనం లభిస్తుంది. దిండు బాగా ఎత్తుగా లేదా క్రింది భాగంలో ఉండకుండా సమాంతరంగా ఉండాలి. ఇలా చేయడం వల్ల మెడ బిగుసుకుపోదు. కాబట్టి నిద్ర చక్కగా పడుతుంది.