ఏమిటీ.. ఆశ్చర్యపోతున్నారా? మామిడి పళ్ళను ఎలా తినాలో మాకే చెబుతారా అనుకోకండి.మామిడి పళ్ళు ఎలా తిన్నా ఆరోగ్యమే ఎందుకంటే అది పళ్ల జాతిలోనే రారాజు. అయితే మామిడి పళ్ళని తినే పద్ధతిలో మెలకువను తెలుసుకుంటే మరిన్ని ప్రయోజనాలను పొందవచ్చనటున్నారు నిపుణులు.
మామిడి పండ్లను నీళ్ళలో నానబెట్టడం వల్ల కలిగే ప్రయోజనం
మామిడి పళ్ళని ఒక పద్ధతిగా తినటం ఏంటనుకుంటున్నారా.. మామిడి పండ్ల మీద ఒక రకమైన ఫైటిక్ ఇది చర్మానికి అంటుకుంటే అలర్జీ తలెత్తవచ్చు. దురద పుట్టవచ్చు. అందువల్ల మామిడికాయలనైనా, పండ్లనైనా తినే ముందు ఒక అరగంట నీళ్ళలో నానబెట్టి శుభ్రంగా కడిగి తినడం మంచిది. తొడిమ దగ్గర సొన పూర్తిగా పోయేలా చూసుకోవాలి. ఇందుకోసం మామిడి పండ్లను కనీసం అరగంట నీటిలో నానబెట్టి కడగటం మంచిది. దీంతో పండ్లపై ఉండే ఫైటిక్ ఆమ్లం పూర్తిగా తొలగిపోతుంది.
ఆయుర్వేదం ఏంచెబుతోంది?
ఆయుర్వేదం ప్రకారం భోజనంతో పాటు పండ్లను తినకూడదు. అయితే మామిడి పండ్లు దీనికి మినహాయింపు, పాలతో కలిపి మామిడి పండ్లను తీసుకుంటే మంచి బలవర్ధక ఆహారంగా పనిచేస్తుంది. ముఖ్యంగా శృంగారం మీద ఆసక్తిని బాగా పెంచుతుంది. పిత్త, వాత దోషాలను తగ్గిస్తుంది.
ఈ సమస్యలున్నవారు మామిడి పండ్లను తీసుకోకూడదు
అయితే జీర్ణ సమస్యలు, రుమటాయిడ్ ఆర్థరైటిస్, సోరియాసిస్, ల్యూపస్ వంటి ఆటోఇమ్యూన్ జబ్బులు ఉన్నవారు, చర్మ సమస్యలు ఉన్నవారు మామిడి పండ్లను పాలతో కలిపి తీసుకోకూడదు. మామిడిలో యాంటియాక్సిడెంట్ల గుణాలతో కూడిన గ్యాలటానిన్లు వంటి వృక్ష రసాయనాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి విశృంఖల కణాల దుష్ప్రభావాలను అడ్డుకుంటున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే తొక్కతోపాటు తింటేనే ఇవి శరీరానికి అందుతాయి. ఎందుకంటే ఇవి తొక్క కిందే ఉంటాయి మరి.
జీర్ణక్రియలో కీలకపాత్ర
మామిడి పండ్లు జీర్ణక్రియలో కీలకపాత్ర పోషిస్తాయి. దీర్ఘకాల మలబద్ధకం తగ్గించడంలో కూడా తోడ్పడతాయి. మామిడిలో విటమిన్ ఎ, సి ఎక్కువగా ఉంటాయి. ఇవి చర్మాన్ని బిగుతుగా ఉంచే కోలాజెన్ ఉత్పత్తిలో సహాయపడతాయి. చర్మం నిగానిగలాడేలా చేయడమే కాకుండా, యాంటీఏజింగ్ లోనూ తోడ్పడతాయి.