ప్రతి కూరకు రుచి రావాలంటే ఉప్పు తప్పనిసరి. అలాగని మోతాదుకు మించితే అనారోగ్య సమస్యలు తప్పవు. అందుకే ఉప్పును మితంగా తీసుకోవాలి.
రోజూ 5 నుంచి 6 గ్రాముల కంటే ఎక్కువగా ఉప్పు తీసుకుంటే ఆరోగ్యపరంగా అనర్థాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. నిజానికి ఉప్పును ఎంత మితంగా తీసుకుంటే అంత నయం అని చెప్పవచ్చు. ఎందుకంటే మనం కూరల్లో వేసుకునే ఉప్పుతో పాటు పలు కూరగాయలు, ఆకుకూరల్లోనూ కొంచెం పరిమాణంలో ఉప్పు ఉంటుంది. బయటి నుంచి ఉప్పును అధికంగా వేయడం వల్ల కూర రుచిపోవడంతోపాటు అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఉప్పు ఎక్కువ తీసుకుంటే కలిగే అనర్ధాలు ఇవే
తొలుత డీ హైడ్రేషన్ కు గురవుతారు. ఆ తర్వాత రక్త ప్రసరణ వేగం పెరుగుతుంది. అంటే రక్తపోటు నియంత్రణ స్థాయి కంటే మించిపోయి రక్తపోటుకు దారి తీస్తుంది.
శరీరంలో ఉప్పు శాతం పెరిగితే జీవక్రియలన్నీ ఒకదాని వెంట ఒకటి మారిపోతాయి. ఉప్పు ఎక్కువగా తీసుకునేవారు ఎక్కువ నీరు తాగాల్సి ఉంటుంది. అందుకు సరపడా నీరు తాగకపోతే శరీర కణాల నుంచి నీటిని లాగేస్తుంది. ఫలితంగా రక్తంలో ఘనపరిమాణం పెరుగుతుంది. దాంతో గుండెకు పని ఎక్కువవుతుంది.
రక్తనాళాలపై ఒత్తిడి ఎక్కువై క్రమంగా రక్తపోటు సమస్య మొదలవుతుంది. శరీరంలో నీరంతా చెమట రూపంలో వెళ్లిపోవడంతో అధిక దాహం, తల నొప్పి, అలసట లాంటి సమస్యలు వస్తాయి.
శరీరంలో ఉప్పు శాతం ఎక్కువైతే తొలుత డీ హైడ్రేషన్ కు గురవుతారు. ఆ తర్వాత రక్త ప్రసరణ వేగం పెరుగుతుంది. అంటే రక్తపోటు నియంత్రణ స్థాయి కంటే మించిపోయి రక్తపోటుకు దారి తీస్తుంది.
రక్తనాళాలపై ఒత్తిడి ఎక్కువై క్రమంగా రక్తపోటు సమస్య మొదలవుతుంది. శరీరంలో నీరంతా చెమట రూపంలో వెళ్లిపోవడంతో అధిక దాహం, తల నొప్పి, అలసట లాంటి సమస్యలు వస్తాయి.
ఉప్పు వాడకాన్ని గమనించండి
ఉప్పు వినియోగం ఒక్కొక్కరిలో ఒక్కో విధంగా ఉంటుంది. ఇది శరీరాన్నిబట్టి మారుతుంది. ఎవరి శరీర లక్షణాలనుబట్టి వారు ఉప్పు పరిమాణాన్ని నిర్ణయించుకోవాలి. మొత్తంగా మితంగా ఉప్పు తీసుకుంటేనే ఆరోగ్యం. మధుమేహ రోగులు ఉప్పు పరిమాణాన్ని తప్పనిసరిగా దృష్టిలో ఉంచుకోవాలి. అయితే ఇవన్నీ ఆరోగ్యపరంగా కలిగేవి. కానీ ఆరోగ్యం కాకుండా మిగతా విషయాల్లో చూస్తే ఉప్పు మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది. దాంతో మనం పలు ఇబ్బందులను ఎదుర్కోవచ్చు. చర్మంపై ఉన్న మృత కణాలను తొలగించేందుకు ఉప్పు బాగా ఉపయోగపడుతుంది. అంతేకాదు ఉప్పు వల్ల చర్మం కాంతివంతంగా కూడా మారుతుంది.