సమస్య :
నాకు చాలా కాలంగా అస్థమా సమస్య ఉంది. నేను ఇప్పటికీ ఇన్హేలర్ వాడుతున్నాను. అయితే కోవిడ్ వ్యాధి ఎక్కువగా ఊపిరితిత్తుల మీద ప్రభావం చూపిస్తోంది కదా. నాకు ఇంతవరకు కోరోనా వ్యాధి సోకలేదు. అయితే అస్థమా వ్యాధితో బాధ పడుతున్నవారికి కోవిడ్ వ్యాధి సోకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. ఇది నిజమేనా?
జవాబు :
కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ కు గురయిన వారికి మాత్రమే కోవిడ్ వ్యాధి వస్తుంది. వయసు పైబడిన వారిలో దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో అంటే గుండె సమస్యలు, ఊపిరితిత్తుల సమస్యలు, షుగర్ వ్యాధి ఉన్నవారు ఇంకా రోగనిరోధకశక్తి తక్కువగా ఉన్నవారిలో లేదా క్యాన్సర్ వంటి జబ్బులకు చికిత్స తీసుకుంటున్న వారిలో లక్షణాలు తీవ్రంగానే ఉంటున్నాయి. అలాగే వ్యాధి తీవ్రం అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. అయితే Covid-19 వ్యాధి శ్వాస మార్గాన్ని (ముక్కు, గొంతు, ఊపిరితిత్తులు) దెబ్బతీస్తుంది.
ఊపిరితిత్తుల్లో వచ్చే ఇతర ఇన్ఫెక్షన్ల మాదిరిగానే కోరోనా వైరస్ కూడా ఆస్తమా తీవ్రతను పెంచవచ్చు. ఆ తరువాత ఇది నిమోనియాకు దారి తీసే అవకాశాలు ఉన్నాయి. ఇంతకుముందే అస్థమా ఉన్నవారిలో లక్షణాలు ఎక్కువగా ఉంటే నిమోనియా ఎక్కువై అది ప్రాణాంతకంగా మారవచ్చు.
అందుకని అస్థమా ఉన్నవారు కోవిడ్ వ్యాధిని కలగజేసే కరోనా వైరస్ సోకకుండా మిగతావారికంటే ఎక్కువ జాగ్రతలు తీసుకోవాలి. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే కరోనా వైరస్ సోకి ఎటువంటి లక్షణాలు లేకపోయినప్పటికీ వారి ద్వారా వైరస్ ఇంకొకరికి వ్యాపించే అవకాశాలు ఉన్నాయి.
ఎవరైనా మీకు సమీపంలో దగ్గినా, తుమ్మినా వారినుంచి వెలువడిన డ్రాప్ లెట్స్ మీ చేతుల మీద కానీ, మొహం మీద కానీ పడినపుడు వెంటనే వెళ్ళి నీటితో శుభ్రంగా కడుక్కోవాలి.
మీ ముందు దగ్గిన వ్యక్తికి ఇతర లక్షణాలు అంటే జ్వరం, దగ్గు, జలుబు, చలి, ఒళ్ళు నొప్పులు, ఊపిరి తీసుకోవడంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయేమో అడిగి తెలుసుకోవాలి. వారిలో అలాంటి లక్షణాలు ఉన్నాయని అనిపిస్తే మీరు వెంటనే డాక్టర్ ని కలిసి తగిన చికిత్స తీసుకోవాలి.
మీలో లక్షణాలు పెరగకుండా ఉండటానికి మిమ్మల్ని మీరు 14 రోజుల పాటు సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉంచుకోవాలి. ఈ విషయంలో ఒకసారి డాక్టర్ ని కలవడం తప్పనిసరి.
ఇవి కూడా చదవండి
సారీ… రెండోసారీ కోవిడ్ రావచ్చు: హాంకాంగ్ సైంటిస్టులు
కరోనా వైరస్: పిల్లల చేతికి కరెన్సీ నోట్లు, టివి రిమోట్, సెల్ ఫోన్ ఇస్తున్నారా? జరభద్రం!
Pulse Oximeter: ఇది మీ దగ్గర ఉంటే కరోనా మీకు దూరం అయినట్టే!
[wpdiscuz-feedback id=”mjmzxwoj6n” question=”Please leave a feedback on this” opened=”0″][/wpdiscuz-feedback]
I got clarity about covid-19 as an asthma patient