ఖర్జూరం శక్తిని ఇవ్వడమే కాకుండా ఇమ్యూనిటీని పెంచుతుంది. చినుకులు పడుతున్న సమయంలో ఖర్జూరం తింటే ఆరోగ్యానికి మంచిది అంటున్నారు నిపుణులు.
dates for diabetes
ఫైబర్, పొటాషియం, ఐరన్ ఎక్కువగా ఉండే వీటిని తింటే తీపి పదార్థాలు తినాలని అనిపించదు.
ఖర్జూరంలో గ్లైసిమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. అందుకే డయాబెటిస్ ఉన్నవాళ్లు కూడా వీటిని తినొచ్చు.
ఏ టైంలో తినాలంటే ఉదయాన్నే, లంచ్ తర్వాత, పిల్లలు, ముఖ్యంగా టీనేజ్ పిల్లలు లంచ్ టైంలో ఖర్జూరం తినడం తప్పనిసరి.
ఖర్జూరం తింటే హిమోగ్లోబిన్ శాతం, ఎనర్జీ లెవల్స్ పెరుగుతాయి.
ఇందులోని ఫైటోకెమికల్స్ కొలెస్ట్రాల్, గుండె జబ్బుల ముప్పుని తగ్గిస్తాయి. నిద్ర సమస్యలు ఉన్నవాళ్లు ఖర్జూరం తింటే మంచిది.
వర్షాకాలంలో వచ్చే చాలా వరకు ఇన్ఫెక్షన్లు, అలర్జీల బారిన పడకుండా ఉండొచ్చు.
ఖర్జూరం తింటే ఎక్సర్సైజ్ చేసే సామర్థ్యం పెరుగుతుంది. కడుపు ఉబ్బరం, అసిడిటీ వంటి సమస్యల నుంచి రిలీఫ్ ఉంటుంది.
గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. దీన్ని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.