కోవిడ్ సమయంలో ఏ చిన్న అనారోగ్యం మొదలైనా కంగారుగానే ఉంటోంది. జ్వరం, దగ్గు, జలుబు ఈ మూడింటిలో దగ్గు తగ్గకపోతే మాత్రం చాలా ఇబ్బందిగా, భయంగా ఉంటోంది. ఎందుకంటే కోవిడ్ వ్యాధి ఎక్కువగా ఊపిరితిత్తులను ఇబ్బంది పెట్టడం వల్ల శరీరంలో ఆక్సీజన్ స్థాయిలు పడిపోయి ఒక్కోసారి ప్రాణాంతకంగా మారుతోంది. అయితే ఈ సమయంలో దగ్గుని తగ్గించుకోడానికి ప్రకృతిసిద్ధమైన కొన్ని చిట్కాలను పాటిస్తే దగ్గు నుంచి ఉపశమనం పొందవచ్చునని డాక్టర్లు చెబుతున్నారు.
ప్రకృతిసిద్ధ చిట్కాలు
తేనె
ఒక టి స్పూన్ లేదా రెండు టి స్పూన్ ల తేనె శరీరంలో శ్లేష్మం (mucus) యొక్క ఉత్పత్తిని తగ్గిస్తుంది. తేనె సూక్ష్మ క్రిములను చంపడంలో బాగా ఉపయోగపడుతుంది. అయితే ఇది సంవత్సరంలోపు పిల్లల్లో చాలా తక్కువసార్లు ఫుడ్ పాయిజన్ కు కారణం అవుతుంది. అందుకే సంవత్సరంలోపు పిల్లలకు తేనె ఇవ్వకపోవడమే మంచిది.
వేడి పానియాలు
తల పట్టేయడం వంటి సమస్యలను వేడినీటి పానియాలు తగ్గించవు. కానీ ఇవి దగ్గునుంచి ఉపశమనం కలిగించడంలో బాగా ఉపయోగపడతాయి. దగ్గు నుంచి ఉపశమనం కోరుకుంటే కాస్త వేడిగా టి కానీ, వేడి నీళ్ళు తాగడం కానీ చేయవచ్చు.
అల్లం
అల్లంలో ఉండే కొన్ని సమ్మేళనాలు ఊపిరి తీసుకునే వాయు మార్గాల్లో ఉండే కండరాలు బిగుసుకుపోయిన కండరాలను సడలించవచ్చని పరిశోధనలు చెబుతున్నాయి. ఈ అల్లం పచ్చిగా తినవచ్చు లేదా తేనెతో కలిపి వేడి నీటిలో తాగవచ్చు.
నీరు
నీరు ఎక్కువగా తీసుకోవడం వలన దగ్గుకి కారణం అయ్యే శ్లేష్మాన్ని ఎప్పటికప్పుడు ఇది తగ్గిస్తుంది. అంతేకాకుండా శరీరంలో తేమ తగ్గకుండా చూస్తుంది. కేవలం దగ్గు వలన మందులు తీసుకోవలసిన అవసరాన్ని ఇది తగ్గిస్తుంది.
వేడినీటి ఆవిరి
వేడినీటి ఆవిరి తీసుకోవడం వలన ఇది శ్వాసనాళాలో కలిగే ఇబ్బందులను తొలగిస్తుంది. అలాగే ఊపిరితిత్తులకు ఆక్సీజన్ బాగా అందేలా చేసి శ్వాస సమస్యలను తగ్గించడంలో తోడ్పడుతుంది. ఈ వేడి నీటిలో కాస్త ఘాటుగా ఉండే మిరియాల రసం వంటి వాటిని కలుపుకుని ఆవిరిపడితే అది ఇంకా ఎక్కువ ఉపశమనాన్ని ఇస్తుంది.
నీటిని ముక్కు ద్వారా వదలడం
దగ్గు రావడానికి ప్రధాన కారణం వాయునాళాల పై భాగంలో వాపు రావడమే. ఈ వాపుని తగ్గించడానికి ఉప్పు కలిపిన నీటిని ఒక నాసికా రంధ్రం గుండా ఇంకో నాసికా రంధ్రంలోకి వదలడమే. ఇలా చేయడం ద్వారా ముక్కులో ఉన్న శ్లేష్మం బయటకు వచ్చేస్తుంది. శ్లేశ్మాన్ని తయారుచేసే కారకాలు కూడా బయటకు వచేస్తాయి. శ్వాస కూడా సులభంగా తీసుకోగలుగుతారు.
పరికి పండ్లు
పరికి పండ్ల రసాన్ని మీరు తీసుకునే మందులతో లేదా సిరప్ లతో కలిపి తీసుకుంటే దగ్గు ప్రభావం తగ్గకపోవచ్చు కానీ దగ్గు తొందరగా నయం అవడానికి దోహదం చేస్తుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.
మెంథాల్
మిరియాల లేపనాన్ని కలిగి ఉన్న మెంథాల్ బామ్ ను గొంతు కింది భాగంలో అలాగే చెస్ట్ భాగంలో పూసుకుంటే అది ముక్కు దిబ్బదను పోగొట్టి ముక్కు రంధ్రాలు తెరుచుకోవడానికి సహాయపడుతుంది. ఇది సిరప్ రూపంలో కూడా దొరుకుతుంది. మిరియాలు కలిపిన టి తీసుకోవడం కూడా మంచిదే.
గార్గిలింగ్
గొంతు నొప్పి తగ్గడానికి కాస్త వేడి నీటిలో ఉప్పు కలిపి పుక్కిలిస్తే గొంతు గరగర పోతుంది. అయితే ఇది గొంతు నొప్పి ఉన్నపుడే మాత్రమే ఉపయోగపడుతుంది అని అందరూ అనుకుంటారు. కానీ ఈ ప్రక్రియ దగ్గుని తగ్గించడంలో కూడా ఉపయోగపడుతుంది. ఒక అర చెంచాడు ఉప్పుని గ్లాసు గోరువెచ్చని నీటిలో కలిపి నోట్లో పోసుకుని తల వెనక్కి చేసి గొంతులో గరగర చేసి ఉమ్మేయడం ద్వారా శ్లేష్మం నియంత్రణలోకి వస్తుంది.
హ్యూమిడిఫైర్
ఇప్పుడు మార్కెట్లో హ్యూమిడిఫైయర్ లు కూడా దొరుకుతున్నాయి. ఇవి దగ్గుకి కారణం అయ్యే అలర్జీ కారకాలను ముక్కులోంచి, గొంతులోంచి బయటకి పంపడానికి సహాయపడతాయి. వీటిలో నీటిని పోసి కరెంటు కనెక్ట్ చేస్తే నీరు వేడిగా అవుతాయి. ఆ వేడి నీటి ద్వారా వచ్చే ఆవిరిని గొంతులోకి, ముక్కులోకి పీల్చడం ద్వారా ఎలర్జీ దూరం అవుతుంది.