కరోనా వైరస్ జన జీవనాన్ని అతలాకుతలం చేస్తున్న ఈ సందర్భంలో వైరస్ ఒకరినుంచి మరొకరికి సోకకుండా ఉండటానికి అందరూ మాస్క్ లు ధరించాలని డాక్టర్లు, ప్రభుత్వాలు చెబుతూనే ఉన్నాయి. ఈ సమయంలో ముఖానికి మాస్క్ ధరించడం సురక్షితం కూడా. దీని ద్వారా వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపించకుండా ఉంటుంది. అయితే ఏ మాస్కులు ధరించాలి? ఏవి సురక్షితం? అనే అనుమానాలు ప్రజల్లో ఉన్నాయి.
ఈ సందర్భంగా టైమ్స్ ఆఫ్ ఇండియా వారు నిర్వహిస్తున్న మాస్క్ ఇండియా క్యాంపెనింగ్ లో ప్రముఖ హార్ట్ సర్జన్ డా. దేవిశెట్టి గారు మాట్లాడుతూ… అందరూ డాక్టర్లు, నర్సులు, ఇతర హాస్పిటల్ సిబ్బంది ఉపయోగించే సర్జికల్ మాస్కులనే ఉపయోగించాలని అనుకుంటున్నారు. కానీ సర్జికల్ మాస్కులు సాధారణ ప్రజలు ఉపయోగించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సర్జికల్ మస్కూలు తుమ్మునపుడు, దగ్గినపుడు వచ్చే తుంపరలు ఈ సర్జికల్ మాస్క్ లోకి ఇంకవు. అంతే కాకుండా సర్జికల్ మాస్కులు ఆరు గంటల వరకు మాత్రమే పనిచేస్తాయి. మీరు ఇంటికెళ్ళిన తరువాత ఆ మస్కులను డస్ట్ బిన్ లోనో లేదా టేబుల్ పైనో పెడతారు. దాన్ని మీ పిల్లలు గనక తాకితే వైరస్ వారికి సోకే అవకాశం ఉంటుంది. అలాగే మీరు పారేసే చేతను GHMC వాళ్ళు రీ సైకిల్ చేస్తారు. అలా కూడా వైరస్ వ్యాప్తి జరుగుతుంది.
అందుకే బట్టతో తయారు చేసిన మాస్కులను ధరిస్తే మీరు వాటిని రోజూ ఉతికి మళ్ళీ వాడుకోవచ్చు. బట్టకి తడిని తనలోకి ఇంకే గుణం ఉంటుంది. కాబట్టి క్లాత్ తో తయారు చేసిన మాస్కులని ధరించడమే సురక్షితం. ఈ విషయంపై అవగాహన కల్పిస్తున్న టైమ్స్ ఆఫ్ ఇండియా వారికి కృతజ్ఞతలు కూడా తెలిపారు డా. దేవిశెట్టి.
Amazon offers re-usable Masks: