నావెల్ కరోనా వైరస్ జన్మస్థానం వుహాన్ అని అందరికీ తెలుసు. మరి అమెరికా, ఇటలీ, స్పెయిన్ మరణాలు చైనా కన్నా ఎందుకు ఎక్కువగా ఉన్నాయి. చైనాలో పుట్టిన వైరస్ చైనా కంటే ఇతర దేశాలనే ఎక్కువగా దెబ్బతీసిందా? ఇది నమ్మసఖ్యంగా లేని విషయం. అయితే చైనా మిగతా విషయాలలాగే ఈ విషయంలో కూడా ప్రపంచానికి అబద్దాలు చిప్పిందన్నమాట. ఇప్పుడు వుహాన్ శ్మశానాల్లో చితాభస్మం కుండల చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అక్కడి స్థానికుల్లోనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మార్చి 31 నాటికి ఆ దేశంలో మరణాల సంఖ్య 3305 అని అధికారికంగా చెపుతున్నారు. కానీ చితాభస్మాల కుండలను చూస్తుంటే కనీసం 40 వేల మందికి పైగా మరణించారని తెలుస్తోంది. వుహాన్ లో 50 వేలకు కేసులు నమోదైతే కేవలం 2635 మంది మాత్రమే మరణించారని చైనా అధికారికంగా చెబుతోంది. కానీ బుధ, గురువారాల్లో ఎనిమిది శ్మశాన వాటికలకు 2500 చొప్పున మొత్తం 20000 కుండలు వచ్చాయి. కానీ ఒక శ్మశాన వాటికలో 3500 కుండలున్న చిత్రం బయటికి రావడంతో అనుమానాలు మొదలయ్యాయి. అంటే covid-19తో మరణించిన వారికంటే కూడా ఒకే శ్మశాన వాటికలో కుండలు ఎక్కువగా ఉన్నాయి.
పై ఉదాహరణను బట్టి వుహాన్ లో 26 వేల నుంచి 40 వేల మంది మరణించి ఉంటారని అక్కడి స్థానికులు అంచనా వేస్తున్నారు. ఇక ఆ నగరంలోని ఏడు శ్మశాన వాటికలు మార్చి 23 నుంచి ఏప్రిల్ 4 మధ్య సగటున 3500 చితాభస్మం కుండలను పంపిణీ చేస్తాయని అంచనా. ఎదుకంటే చనిపోయినవారి స్మారకార్ధం అక్కడ కింగ్ మింగ్ అనే పండగ జరుపుకుంటారు. అంటే ఈ పన్నెండు రోజుల కాలంలో దాదాపు 42 వేల కుండలను పంపిణీ చేస్తారు. చైనాలో ఏటా మరణాల రేటు ప్రకారం లెక్కిస్తే గత రెండు నెలల్లో పదహారు వేల మంది మరణించారని అంచనా.