చాలా మందికి ఎంత సేపు వాకింగ్ చేయాలి ? ఎన్ని అడుగులు నడవాలి ? అనే సందేహాలు వస్తూంటాయి. రోజుకు ఎన్ని అడుగులు నడిస్తే మంచిది? స్ట్రెస్ నుంచి ఎలా రిలీఫ్ దొరుకుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
Benefits of Walking
వాకింగ్ చేయడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. వాకింగ్ తో అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి. వాకింగ్ వల్ల ఒత్తిడి, ఆందోళన వంటి వాటి నుంచి తప్పించుకోవచ్చు. బరువు తగ్గడం, రక్త పోటు, మధు మేహాన్ని కంట్రోల్ లో ఉంచుకోవచ్చు. గుండె ఆరోగ్యంగా ఉండం, జీర్ణ వ్యవస్థ మెరుగు పడటమే కాకుండా ఇంకా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే రోజూ కనీసం అరగంటైన వాకింగ్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
వాకింగ్ చేయడానికి సమయం, సందర్భం అవసరం లేదు. ఉదయమైనా, సాయంత్రమైనా చేసుకోవచ్చు. వాకింగ్ చేయడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. దీంతో జ్ఞాపక శక్తిని పెంపొందించుకోవచ్చు. మెదడుపై ప్రభావం కూడా తగ్గుతుంది. చాలా మంది పార్కులో వాకింగ్ చేస్తూంటారు. దీని వల్ల ఆక్సిజర్ సరఫరా కూడా బాగా అందుతుంది.
ఎన్ని అడుగులు నడవాలి?
సాధారణంగా అరగంట సేపు వాకింగ్ చేస్తే సరిపోతుంది. దీని వల్ల బాడీ ఫిట్ గా కూడా మారుతంది. పలు అధ్యయనాల ప్రకారం రోజూ 5 వేల అడుగులు నడిస్తే సరిపోతుందని చెబుతున్నారు నిపుణులు. దీంతో వ్యాధుల బారిన పడే అవకాశం 70 శాతం వరకూ తగ్గుతుంది.
మెదడుపై ప్రభావం తగ్గుతుంది:
రోజూ వాకింగ్ చేయడం వల్ల మెదడుపై ప్రభావం తగ్గుతుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. దీంతో ఇతర వాటిపై ఏకాగ్రత కూడా పెరుగుతుంది.
ఒత్తిడి, ఆందోళన తగ్గుతుంది:
వాకింగ్ చేయడం వల్ల ఒత్తిడి, ఆందోళన నుంచి రిలీఫ్ అవ్వొచ్చు. రోజూ నడక వల్ల బాడీలో ఎండార్ఫిన్ లు విడుదల అవుతాయి. ఇది మూడ్ ని మారుస్తుంది. అంతే కాకుండా కార్టిసాల్ అనే ఒత్తిడి హార్మోన్ ల ఉత్పత్తిని కూడా తగ్గిస్తుంది. దీంతో ఉద్రిక్తత భావాలను కూడా తగ్గించడంలో వాకింగ్ హెల్ప్ చేస్తుంది.
నిద్ర నాణ్యత పెరుగుతుంది:
రెగ్యులర్ గా వాకింగ్ చేయడం వల్ల నిద్ర నాణ్యత పెరుగుతుంది. మెరుగైన నిద్ర.. ఒత్తిడి, ఆందోళన, నిరాశ, భయం వంటి వాటిని దూరం చేస్తుంది. నిద్ర బాగా పడితే ఆరోగ్యం కూడా ఉంటారు. దీంతో జీవితంలో పలు సవాళ్లను ఎదుర్కోవడానికి సన్నద్ధంగా ఉంటారు.
వాకింగ్ ని అలవాటు చేసుకోండి:
వాకింగ్ చేయడం అలవాటు లేకపోతే.. అలవాటు చేసుకోవడం ముఖ్యం. మొదట మెల్లగా ప్రారంభించి రోజువారీ వాకింగ్ డిస్టెన్స్ ని పెంచుకుంటూ ఉండాలి. అంతే కానీ ఒకటేసారి ఎక్కువగా నడవకూడదు. దీంతో డీ హైడ్రేషన్ కు గురయ్యే అవకాశం ఉంది.
గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. వీటిని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.