యూరప్ దేశమైన బెల్జియంలో 90 సంవత్సరాల వయసులో ఉన్న స్త్రీకి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉంటే కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రికి తీసుకొచ్చారు. డాక్టర్ లు ఆమెకు వెంటిలేటర్ అమరుస్తుండగా ఆమె నిరాకరించింది. “నా జీవితాన్ని నేను చాలా ఆనందంగా గడిపాను. ఈ కృత్రిమ పరికరాలు ఇచ్చే శ్వాసతో నేను బతకాలి అనుకోవడం లేదు. ఈ వెంటిలెటర్ ను నాకంటే వయసులో చిన్న వాళ్ళకు అమర్చండి” అని ఆమె వెంటిలేటర్ ను నిరాకరించింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె కొద్ది రోజుల్లోనే మరణించింది.
సుజాన్నే హోయలెర్ట్స్ అనే యువతి బాగా అలసటతో, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందితో బాధపడుతుంటే ఆమెను ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ ఆమెకు Covid-19 వ్యాధి ఉందని డాక్టర్లు నిర్ధారించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసిన డాక్టర్ లు ఆమెకు తుది వీడ్కోలు పలకడానికి సిద్ధంగా ఉండమని ఆమె కూతురికి చెప్పేశారు. అలా సుజాన్నే మార్చి 22వ తేదీన తుది శ్వాస విడిచారు. ఆవిడకి వైరస్ ఎలా సోకిందో కుటుంబ సభ్యులకు తెలియలేదు.
జాన్ హప్కిన్స్ యూనివర్సటి వారు ఇచ్చిన నివేదిక ఆధారంగా మార్చి 22 నాటికి బెల్జియంలో సుమారు 12,775 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అందులో 705 మరణాలు సంభవించాయి.