గర్భిణీ స్త్రీలలో రక్తం తక్కువగా ఉంటే, ఈ సమస్యలు ఎక్కువ?

gray scale photo of a pregnant woman

ఇరవై ఏళ్ళకి ముందు కాని, ముప్పై ఏళ్లు దాటాక కాని, ముప్పై ఐదు ఏళ్ళు నిండిన తరువాత గానీ ఏ స్త్రీ అయినా గర్భం దాల్చితే, కాన్పు జరిగే వరకూ వచ్చే సమస్యల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఆడపిల్లలకు పదహారు ఏళ్ళ వయసులో రక్తహీనత ఎక్కువగా ఉంటుంది. అందుకు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే తల్లీ బిడ్డ సమస్యల్లో ఇరుక్కొక తప్పదు.

ఆడపిల్లకు సరైన వయసులోనే ఎందుకు పెళ్లి చేయాలి?

గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకునే ముందు అసలు గర్భం ఎప్పుడు దాల్చాలి అనే విషయాన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యం. మన తెలుగు రాష్ట్రాల్లో ఇంకా అక్కడక్కడా పదిహేను నుంచి పదహారు  ఏళ్ళకే పెళ్ళిళ్ళు చేసేస్తున్నారు. ఇలాంటి పెళ్లిళ్లను ప్రోత్సహించడం మంచిది కాదు. ఎందుకంటే గర్భం దాల్చడానికి అనువైన వయస్సు ఇరవై ఒకటి నుంచి ఇరవై తొమ్మిది ఏళ్ళు. ఈ వయసులో గర్భం దాల్చడం వల్ల సమస్యలు చాలా తక్కువగా ఉంటాయి.

గర్భిణీ స్త్రీ రక్తంలో ఎంత శాతం హిమోగ్లోబిన్ ఉండేలా చూసుకోవాలి?

రక్తహీనతను తగ్గించడానికి డాక్టర్ లు ఐరన్‌ టాబ్లెట్లు వాడమని చెపుతున్నారు. అయినా కాని ఆడపిల్లల్లో పూర్తిగా రక్తహీనత తగ్గటం లేదు. గర్భం దాల్చేటప్పుడు కనీసం 12.5శాతం హిమెగ్లోబిన్‌ ఉంటేనే తల్లీ బిడ్డ క్షేమంగా ఉండే అవకాశం ఉంటుంది. మొదటి నుంచి రక్తహీనత ఉండటం వల్ల కాన్పు సమయంలో కొద్ధిగా రక్తస్రావం అయినా తట్టుకోలేకపోతున్నారు.

అంతేకాకుండా తల్లికి రక్తహీనతతో పాటు పోషకాహారలేమి కూడా ఉన్నపుడు బిడ్డ ఎదుగుదల దెబ్బతింటుంది. పిల్లలు పెద్దయిన తర్వాత అనేక వ్యాధులకు గురయ్యే అవకాశం ఉంటుంది.

శరీరంలో తగినంత రక్తం ఉన్నప్పుడే శరీరంలోని కణాలకు ఆక్సిజన్‌ సరఫరా సక్రమంగా జరిగి జీవక్రియలు చురుగ్గా, సజావుగా జరుగుతూ ఉంటాయి. శరీరంలో శక్తి పెరుగుతూ ఉంటుంది. ఆలోచనల్లో స్పష్టత ఉంటుంది.

ఇవన్నీ జరగాలంటే ఆహారంలో ఐరన్‌ శాతం తగినంతగా ఉంటుందో లేదో గమనించుకోవాలి. కానీ చాలా మంది ఆహారం అంటే ఆకలి తీర్చుకోవడానికే అనుకుంటారు.

ఇవి కూడా చదవండి

అమ్మ – ఉమ్మనీరు – పండంటి బిడ్డ

ఆస్థమా ఉంటే స్త్రీలలో సంతానలేమీ సమస్యలు వస్తాయా?

మనం తీసుకునే ఆహారంలో రక్తవృద్ధికి తోడ్పడే ఇనుము ఉందో, లేదో తెలుసుకోరు. ఏ పదార్థాల్లో ఐరన్‌ ఎక్కువ ఉంటుందనే అవగాహన కూడా చాలా మందికి ఉండదు. ఫలితంగా అనీమియా బారిన పడుతూ ఉంటారు.

అయితే గర్భిణీలలో తల్లి నుంచి శిశువుకు రక్తం ద్వారా ఆహారం, ఆక్సిజన్‌ సరఫరా అవుతాయి. గర్భిణీలలో రక్తహీనత ఉన్నప్పుడు బిడ్డకు ఆక్సిజన్, పోషక పదార్థాల సరఫరా తగ్గే అవకాశాలు ఉంటాయి.

దీనివల్ల తల్లిలో ఇన్‌ఫెక్షన్స్, నెలలు నిండకుండా కాన్పులు, కాన్పు తర్వాత కూడా సమస్యలు ఉండే అవకాశాలు చాలా ఎక్కువ. ఈ సమస్యలు రక్తహీనత తీవ్రతను బట్టి ఉంటాయి. కొందరిలో అబార్షన్లు అయ్యే అవకాశాలు పెరుగుతాయి.

రక్తహీనత కొద్దిగా ఉండేవాళ్లు దాని తీవ్రతను బట్టి ఐరన్‌ ట్యాబ్లెట్స్, పౌష్టికాహారంతో పాటు అవసరమైన పరీక్షలు చేయించుకొని, తగిన చికిత్స తీసుకోవడం మంచిది.

గర్భం దాల్చేటప్పుడు కనీసం 12.5శాతం హిమెగ్లోబిన్‌ ఉంటేనే తల్లిబిడ్డ క్షేమంగా ఉండే అవకాశం ఉంటుంది. రక్తహీనత బాగా ఎక్కువగా ఉన్నప్పుడు సమస్యలు ఎక్కువగా ఉంటాయి.

రక్తహీనత ఉన్నవారు ఎప్పుడెప్పుడు డాక్టర్ ని కలవాలి?

గర్భం దాల్చిన తర్వాత మొదటి 10-15రోజుల్లో డాక్టర్ని సంప్రదించాలి. గర్భిణీలను పరీక్షించి వారికి గర్భం ఎక్కడ వచ్చింది. సరిగ్గానే ఉందా లేదా, రక్తహీనత ఉందా? లాంటి పరీక్షలు చేయాల్సి ఉంటుంది.

అలాగే బ్లడ్‌గ్రూప్‌ ఏమిటి? వంటి విషయాలను తెలుసుకుంటారు. ఒకవేళ గర్భం ఇతర ప్రాంతాల్లో వచ్చిందా? లాంటివి చూసుకునే అవకాశం ఉంటుంది. అందుకే 3వనెలలోపు డాక్టర్‌ దగ్గరికి వెళ్ళడం మంచిది.

మొదటి 3నెలలలోపు ఒకసారి, 5వనెలలోపు ఒకసారి, 8వనెలలో ఒకసారి, 9వనెలలలో ఒకసారి చూపించుకోవాలి. ఇలాంటి సమయంలో వారికి రక్తపోటు, రక్తహీనత ఇంకా ఎలాంటి జబ్బులు, సమస్యలు ఉన్నాయో తెలుసుకుంటారు.

రక్తహీనత ఉన్నవారిలో పిల్లలు తక్కువ బరువుతో పుట్టడం, మెదడు ఎదుగలలో సమస్యలు వస్తున్నాయి. అందుకని గర్భం దాల్చే 6వారాల ముందు నుంచే ఫోలిక్‌యాసిడ్‌ టాబ్లెట్లు వేసుకుంటుంటే బిడ్డకు పోషకాల లేమి లేకుండా ఉంటుంది.

అంతేకాక, వారిలో రక్తం ఎంత ఉంది. రక్తహీనత ఉందా? ఉంటే దాన్ని నివారించు కోవటానికి కావలసిన టాబ్లెట్లు, ఇంజెక్షన్లు ఎలాంటి ఆహారం తీసుకోవాలో చెప్పటానికి వీలవుతుంది.

ఐరన్, ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉన్న ఆహారాలు

గర్భవతుల్లో రక్తహీనత ఉన్నపుడు ఐరన్ మరియు ఫోలిక్ ఆసిడ్ ఎక్కువగా గల ఆహార పదార్థాలను తీసుకోవాలి.

  • ప్రతి రోజూ ఒక గ్లాసు పాలు తాగాలి
  • రోజూ ఒక గుడ్డు తింటే శరీరానికి కావల్సిన పోషకాలు అందుతాయి
  • బయట నడిచేటప్పుడు ఎప్పుడూ చెప్పులు వేసుకోవాలి
  • మల విసర్జనకు టాయిలెట్స్ వాడాలి
  • మొలలు, అధిక రక్తస్రావం, మలేరియా వంటి సమస్యలు ఉంటే వెంటనే చికిత్స తీసుకోవాలి
  • కాన్పు తర్వాత నాలుగవ నెల నుండి మూడు నెలల వరకు ఐరన్ మరియు ఫోలిక్ యాసిడ్ మాత్రలను క్రమం తప్పకుండా వాడాలి.

కాన్పు అయ్యే వరకూ ప్రతినెలా డాక్టర్ ని కలవాలా?

  • మాములుగా అయితే 7వ నెల వరకు ప్రతినెలా అలాగే 8,9వ నెలల్లో ప్రతి 15రోజులకు ఒకసారి, 9వనెల నుంచి కాన్పు అయ్యే వరకు ప్రతీ వారం ఇలా కనీసం 14సార్లు డాక్లర్‌ దగ్గరికి వెళ్ళి పరీక్షించుకోవాలి
  • ఈ పరీక్షల్లో ప్రతిసారి రక్తపోటును తప్పనిసరిగా చూడాలి
  • ఒకవేళ డాక్టర్లు చూడకపోతే గర్భిణీలు డాక్టర్లను అడగాలి. ఇదే సమయంలో గర్భిణీలు సమతుల ఆహారం తీసుకోవటం కూడా చాలా ముఖ్యం

విశ్రాంతి తీసుకోవడం ఎందుకు ముఖ్యం?

కొంతమందికి విశ్రాంతి గురించి సందేహాలు ఉంటాయి. ఏవైనా సమస్యలు, ఇబ్బందులు ఉన్నప్పుడు డాక్టర్లే విశ్రాంతి గురించి చెబుతారు. మాములుగా అయితే 85శాతం మంది గర్భిణీలలో ఎలాంటి సమస్యలు ఉండవు.

గర్భధారణ సమయంలో ఇలాంటి జాగ్రత్తలు కనుక తీసుకుంటే కాన్పు సమయంలో ఎలాంటి ప్రమాదం జరగదు. 8వ నెల వరకు హీమోగ్లోబిన్ స్థాయి 7 గ్రాముల కంటే తక్కువ ఉన్నట్లయితే తప్పకుండా హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యి చికిత్స తీసుకోవాలి. 

చివరిగా

ఐరన్‌ లోపం వల్ల గానీ, విటమిన్ లోపం వల్ల గానీ వచ్చే రక్తహీనతను తగ్గించాలన్నా, నివారించాలన్నా మనం తీసుకునే ఆహారంలో ఐరన్‌, ఫోలేట్‌, విటమిన్‌ B-12, విటమిన్‌ C ఉండేలా చూసుకోవాలి. మీకు దొరికే ఆహారంలో అవసరమైన పోషకాలు ఉన్నాయో లేదో తెలుసుకోండి. ముఖ్యంగా స్త్రీలు, అందులోనూ గర్భిణీలు, గర్భం దాల్చాలని అనుకుంటున్నవాళ్లు పోషకాహారం తీసుకోవాలి.

గర్భిణీ తన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటే పుట్టబోయే పిల్లలు రక్తహీనత బారిన పడే అవకాశం తగ్గుతుంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top
Scroll to Top