ప్రస్తుతం అందరీనీ వెంటాడుతున్న సమస్య అల్జీమర్స్. చాప కింద నీరులా ఈ వ్యాధి విస్తరిస్తోంది. ముఖ్యంగా మహిళల్లో అల్జీమర్స్ ఎక్కువగా కనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
ఈ వ్యాధి రాకుండా ముందుగానే తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటే.. జ్ఞాపకశక్తిని పెంచుకోవాలి. అలాగే మెదడు ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవాలి. మెదడును యాక్టీవ్ గా ఉండాలంటే సరైన ఫుడ్ ని తీసుకోవాలి. అలాగే జీవన విధానం, ఆహారంలో కూడా మార్పులు చేసుకోవాలి.
అంతే కాకుండా ప్రస్తుత కాలంలో ఇమ్యూనిటీ పవర్ ను పెంచుకోవడం కూడా చాలా అవసరం. బాడీలో రోగ నిరోధక శక్తి ఉంటేనే అనారోగ్య సమస్యలతో పోరాడే శక్తి లభిస్తుంది. శరీరానికి సరైన మోతాదులో పోషకాలు కూడా అందాలంటే ఈ సూపర్ డ్రింక్ తాగాల్సిందే.
సూపర్ డ్రింక్ తయారీ విధానం
ఈ సూపర్ డ్రింక్ కు కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఖర్జూరం, పాలు, పాలను మరగబెట్టి చల్లార్చాలి. అరగంట ముందు కర్జూరాలను గోరు వెచ్చటి నీటిలో నానబెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక జార్ లో వీటిని వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. అంతే హెల్దీ డ్రింక్ తయారవుతుంది. దీన్ని ఫ్రిజ్ లో పెట్టి చల్లగా అయినా తాగవచ్చు. ఈ డ్రింక్ తాగితే ఎన్నో లాభాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
జ్ఞాపక శక్తి మెరుగు పడుతుంది
జ్ఞాపక శక్తిని మెరుగు పరుచుకోవడంలో ఈ డ్రింక్ బాగా సహాయ పడుతుంది. ఈ డ్రింక్ ని ఉదయాన్నే పెద్దలు లేదా పిల్లలు తాగడం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది. రాత్రి పడుకునే ముందు పిల్లలకు ఇస్తే వారు చదివినవి గుర్తుండే అవకాశాలు ఉన్నాయి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగితే రోజంతా యాక్టీవ్ గా ఉంటారు.
కీళ్ల నొప్పులు
పాలలో ఉండే కాల్షియం ఎముకలను స్ట్రాంగ్ చేస్తుంది. దీంతో ఎముకలకు సంబంధించిన కీళ్ల నొప్పులు వంటికి తగ్గుతాయి. ఖర్జూరం ఎముకలకు బలాన్ని ఇస్తుంది. వాపు వంటి వాటిని తగ్గిస్తుంది.
స్కిన్ గ్లో పెరుగుతుంది
క్రమం తప్పకుండా ఈ డ్రింక్ తాగడం వల్ల రక్త ప్రసరణ మెరుగ్గా ఉంటుంది. దీంతో చర్మం నేచురల్ గానే కాంతి వంతంగా తయారువుతుంది. అంతే కాకుండా స్కిన్ పై మంట, చికాకు వంటి వాటిని తగ్గిస్తుంది. రాత్రి పడుకునే ముందు ఈ పాలను తాగాలి.
రక్త హీనత ఉండదు
ఈ డ్రింక్ తాగితే రక్త హీనత సమస్య ఉండదు. ఖర్జూరంలో ఐరన్ అనేది అధికంగా ఉంటుంది కాబట్టి రక్త హీనత సమస్య రాదు. హిమోగ్లోబిన్ కూడా పెరుగుతుంది.
కండరాలు బలంగా తయారవుతాయి
పాలు, ఖర్జూరం కలిపిన డ్రింక్ తాగడం వల్ల కండరాలు బలంగా, దృఢంగా తయారవుతాయి. ఈ రెండింటిలో ఉండే ప్రోటీన్లు కండరాలను ఆరోగ్యంగా ఉంచుతాయి.
గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. దీన్ని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.