అధిక బరువు ఉన్నవారు ప్రతిరోజూ బాదాం తినడం ద్వారా షుగర్ వ్యాధి ముప్పు నుంచి తప్పించుకోవచ్చని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి.
శరీర బరువు నియంత్రణలో ఉండేందుకు ఇది ఉపయోగపడుతుందని ఈ అధ్యయనం తేల్చి నిర్ధారించింది. చెన్నైలోని మధుమేహ పరిశోధన సంస్థకు చెందిన పరిశోధకుల నేతృత్వంలో 25 నుంచి 65 ఏళ్ల మధ్య వయసున్న 400 మందిపై ఈ అధ్యయనం జరిగింది. అందులో వెల్లడైన వివరాల ప్రకారం.. పన్నెండు వారాల వరకు రోజూ బాదాం పలుకులను తింటే వ్యక్తుల్లో క్లోమం పనితీరు మెరుగుపడుతుంది. ఇన్సులిన్ నిరోధకత తగ్గుతుంది. రక్తంలో షుగర్ లెవెల్స్ తగ్గుతాయి. బిఎంఐ తగ్గి శరీర బరువు నియంత్రణలో ఉంటుంది. అధిక బరువు ఉన్నవారిలో ప్రీ-డయాబెటిస్ కండీషన్ ని చాలా వరకు ఆలస్యం చేయవచ్చు.