పాఠశాల వయసులో ఉన్న పిల్లల్లో సాధారణ రక్త పరీక్ష ద్వారా కొలెస్ట్రాల్ ను తనిఖీ చేయవచ్చు. కుటుంబంలో గుండె జబ్బు చరిత్ర ఉన్నా, పిల్లల తల్లిదండ్రులకు అధిక కొలెస్ట్రాల్ ఉన్నా, ఈ పరీక్ష చేయించటం చాలా ముఖ్యం. 95 కంటే ఎక్కువగా బాడీ మాస్ ఇండెక్స్ ఉన్న పిల్లలకు స్క్రీనింగ్ అవసరమని కూడా డాక్టర్లు సిఫార్సు చేస్తారు. వయస్సు 2 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళ లోపు మొదటి స్క్రీనింగ్ కి సిఫారసు చేస్తారు. అధిక బరువు లేదా ఊబకాయం, రక్తంలో అధిక కొవ్వు ఉన్నప్పుడు, “మంచి” కొలెస్ట్రాల్ తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు జాగ్రత్తపడాలి.
చికిత్స ఎప్పుడు ప్రారంభించాలి?
ఎలాంటి ఆహారం తీసుకోవాలో కౌన్సిలింగ్ ఇవ్వటం, శారీరక వ్యాయామం క్రమం తప్పకుండా చెయ్యాలని సూచించటం లాంటివి మొదలవుతాయి ఎక్కువ కొలెస్ట్రాల్ ఉన్నట్టు తేలిన పదేళ్ళు పైబడిన పిల్లలైనా, కుటుంబంలో ఎవరికైనా తక్కువ వయసులోనే గుండె జబ్బు వచ్చి ఉన్నా మందులతో చికిత్స ప్రారంభించాలి.
ఆహారం, వ్యాయామం పాత్ర
వంశపారంపర్యంగా వచ్చినా సరే పిల్లల్లో అధిక కొలెస్ట్రాల్ కు చికిత్స చేయటంలో ఆహారం, వ్యాయామం కీలకపాత్ర పోషిస్తాయి. మొత్తం కుటుంబం ఈ జాగ్రత్తలు పాటించటం వలన ఫలితాలుంటాయి. ఒకరు తింటూ ఇంకొకరు తినకుండా ఉండటం ఆచరణలో ఇబ్బందికరంగా ఉంటుంది. ఎలాగూ వంశపారంపర్యంగా వచ్చిన సమస్యే కాబట్టి అందరూ మితాహారం తీసుకోవటం మంచిది.
పిల్లలకు రోజూ ఎన్ని క్యాలరీలు ఇవ్వాలి
ఆహారంలో ప్రధానంగా కొవ్వు తక్కువగా ఉండేట్టు చూసుకోవాలి. కొలెస్ట్రాల్ తక్కువ ఉన్నట్టు నిర్థారించుకోవాలి. కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్న పిల్లలు రోజువారీ తీసుకునే మొత్తం ఆహారపు కేలరీలలో 30% తక్కువ ఉండేలా చూసుకోవాలి. సంతృప్త కొవ్వు పదార్థాలను దాదాపుగా మానెయ్యాలి. అదే సమయంలో అన్ని రకాల పోషక పదార్థాలూ అందే విధంగా పిల్లలకు రకరకాల ఆహార పదార్థాలు అందజేయాలి. ఆహారం విషయంలో ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటూనే వ్యాయామం గురించి కూడా శ్రద్ధ తీసుకోవాలి.