లండన్: బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కు కరోనా పాజిటివ్ వచ్చి స్వీయ నియంత్రణలోకి వెళ్ళిన విషయం తెలిసిందే. స్వీయ నియంత్రణలోకి వెళ్ళిన ఆయనకు వ్యాధి తీవ్రత తగ్గకపోగా ఆయన ఆరోగ్య పరిస్థితి కొంచెం తీవ్రంగా మారింది. ఈ పరిస్థితిలో ఆయనను ఆసుపత్రికి తరలించి ఐసీయులో ఉంచి చికిత్స అందించారు.
ఇప్పుడు ఆయన ఆరోగ్యం కాస్త మెరుగవడంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన బోరిస్ జాన్సన్ అక్కడి వైద్య సిబ్బందిని ఎంతగానో పొగిడారు. నేను వారికి కృతజ్ఞతలు తెలియజేసి వారి శ్రమను తక్కువ చేయను. ‘నేను వారికి నా జీవితాంతం ఋణపడి ఉంటా’నని బ్రిటన్ లోని సెయింట్ థామస్ ఆసుపత్రిని ఉద్దేశించి ఆయన చెప్పినట్టు ఆయన కార్యాలయం తెలిపింది. బోరిస్ ఆరోగ్యంపై హోంశాఖ ప్రధాన కార్యదర్శి ప్రీతి పటేల్ మాట్లాడుతూ ఆయనకు ఇంకొంత కాలం విశ్రాంతం అవసరం, త్వరలోనే ఆయన తన పనులు ప్రారంభిస్తారని చెప్పారు.