గర్భవతులు తమ ఆరోగ్యం కోసం, తమ కడుపులోని బిడ్డ ఆరోగ్యం కోసం ఒక్కోసారి మందులు వాడాల్సిన అవసరం రావచ్చు. అలాంటప్పుడు సాధారణ అనారోగ్యాల కోసం వాడే మందులైనా, ఇతర పోషక పదార్ధాలైనా అవి వాడే ముందు డాక్టర్ ని సంప్రదించడం మంచిది.
తల్లి అలవాట్లు బిడ్డ ఆరోగ్యం మీద ప్రభావం చూపుతాయి
గర్భస్థ పిండం చక్కగా ఎదగడానికి అవసరమైన ప్రాణవాయువు, పోషక పదార్థాలు, పిండాన్ని కప్పివుంచే ఏ మాయ గుండా పిండానికి అందుతాయో గర్భవతి తీసుకునే ఏ మందులైనా అదే మాయ గుండా వెళ్ళి పిండాన్ని చేరుకుంటాయి. అందువలన గర్భవతిగా వున్న సమయంలో తీసుకునే మందులు పిండంపై అనేక రకాలుగా ప్రభావాన్ని చూపవచ్చు. ఏ మందైనా పిండంపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది, పిండం ఎదుగుదలను బట్టి, ఆ మందు శక్తిని, మోతాదును బట్టి వుంటుంది.
తల్లులకు ఉండే అలవాట్ల ప్రభావం కడుపులోఉండే బిడ్డ ఆరోగ్యం మీద కచ్చితంగా ఉంటుంది. తల్లి ఆరోగ్యం, బిడ్డ ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా ఆరోగ్యకరమైన శిశివును పొందాలంటే మాదక ద్రవ్యాల వినియోగాన్ని నివారించుకోవడం తప్పనిసరి.
- గంజాయి, కొకైన్ మరియు మేథం ఫేటమిన్ వంటి చట్ట విరుద్ధమైన మాదక ద్రవ్యాలు మాత్రమే బిడ్డ ఆరోగ్యం మీద ప్రభావాన్ని చూపిస్తాయని అనుకోవడానికి లేదు.
కెఫెన్, ఆల్కహాల్ లాంటివి కూడా బిడ్డ ఆరోగ్యం మీద ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయి. ఇలాంటి అలవాటు ఉన్న తల్లులకు పుట్టే బిడ్డలకు పుట్టుకతోనే సమస్యలు ఎదురౌతాయి. హార్మోన్ల పంరగానూ బిడ్డలు అనేక సమస్యలు ఎదుర్కోవడానికి ఆస్కారం ఉంది. గర్భిణులు మాదక ద్రవ్యాలు వాడడం వల్ల పిండం మీద ప్రత్యక్ష ప్రభావం పడుతుంది. ఈ విషయాన్ని అనేక అధ్యయనాలు తెలిపాయి.
- పొగతాగడం
- మద్యం సేవించడం
- కాఫీ తీసుకోవడం
ఇలాంటి అలవాట్లు తల్లి ఆరోగ్యాన్ని మాత్రమే కాక, పుట్టబోయే బిడ్డ ఆరోగ్యాన్ని కూడా ఇబ్బందుల్లోకి నెట్టడానికి ఆస్కారం ఉంది. వీటిని వాడే పరిమాణం ఆధారంగా
- గుండె పోటు
- శ్వాసకోశ సమస్యలు
వస్తాయి. ఇవి పుట్టబోయే బిడ్డలకు మరింత ప్రాణాంతకంగా మారడానికి ఆస్కారం ఉంది.
తల్లి మాదక ద్రవ్యాలను వాడితే అది పుట్టబోయే బిడ్డను ప్రభావితం చేస్తుందా?
ముఖ్యంగా గర్భధారణ సమయంలో ఇలాంటి వాటిని తీసుకోవడం వలన
- పుట్టుకతో పిల్లల్లో లోపాలు
- నెలలు నిండక ముందే పిల్లలు పుట్టడం
- తక్కువ బరువు ఉన్న పిల్లలు పుట్టడం
- పుట్టుకతోనే అనేక అనారోగ్య సమస్యలతో పిల్లలు పుట్టడం
వంటి సమస్యలు తలెత్తుతాయి.
అదే విధంగా పిల్లలు పుట్టడానికి ముందు తల్లికి మద్యపానం అలవాటు ఉంటే, అది పిల్లల జ్ఞాపకశక్తిని ప్రభావితం చేస్తుంది. వారికి ఏదీ గుర్తుండకపోవడం లాంటి సమస్యలు ఎదురు కావడానికి ఆస్కారం ఉంది. ఇవేకాకుండా
- కొకైన్
- ఆల్కహాల్
- పొగాకు
మెదడు నిర్మాణంలో మార్పులకు కారణం కావచ్చు. ఇది బిడ్డ ఎదుగుదలను ప్రారంభ దశలోనే ఇబ్బందుల్లో పడేయడానికి ఆస్కారం ఉంది. ముఖ్యంగా కొకైన్ ప్రభావం జీవితాంతం ఉండడానికి అవకాశం ఉంది. ఇది మూత్రాశయాన్ని ప్రభావితం చేయవచ్చు. మెదడుకు సంబంధించి సమస్యలు ఏర్పడవచ్చు. గంజాయి లాంటివి తీసుకోవడం వల్ల పిల్లల్లో శారీరక అభివృద్ధి కుంటుపడేందుకు కారణం కావచ్చు.
ఏయే మాదక ద్రవ్యాలు కడుపులో బిడ్డను ఎలా ప్రభావితం చేస్తాయి ?
గర్భిణీలు ధూమపానం చేయడం వల్ల కూడా కడుపులో బిడ్డలు అనేక సమస్యలు ఎదుర్కొనే వీలుంది. ఇందులోని నికోటిన్ మరియు ఇతర కార్సినోజెనిక్ రసాయనాల కారణంగా పిల్లల్లో గుండె లోపాలు వస్తాయి. ముఖ్యంగా గుండెలో రంద్రాలు ఏర్పడటానికి ఆస్కారం ఉంది. జన్మసిద్ధమైన గుండె లోపాలతో పిల్లలు జన్మించడానికి అవకాశం ఉంది.
గర్భంలో శిశువుకు మావి ద్వారా పోషణ అందడంలోనూ అనేక సమస్యలు వస్తాయి. దీని వల్ల కడుపులోనే బిడ్డ చనిపోవడానికి కూడా అవకాశం ఉంది. దీనితో పాటు ఆల్కహాల్ అలవాట్ల వల్ల పిల్లల పెరుగుదలలో లోపాలకు అధికంగా ఆస్కారం ఉంది. కేంద్ర నాడీ వ్యవస్థను ఇది తీవ్రంగా ప్రభావితం చేస్తుంది.
వీరికి అభ్యసన వైకల్యాలు, దృష్టి సమస్యలు, ఇతర శారీరక వైకల్యాలు ఏర్పడవచ్చు. కెఫెన్ ఉండే పదార్థాలు కూడా శిశువులకు సమస్యలు సృష్టించడానికి ఆస్కారం ఉంది. అందుకే గర్భిణులు వీటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
ధూమపానం, కెఫిన్ కడుపులో బిడ్డ మీద చూపించే ప్రభావం ఏమిటి?
గర్భంతో వున్నప్పుడు నల్ల మందు వంటి మాదక ద్రవ్యాలను తీసుకుంటే, ప్రసవంలో ఇబ్బందులు ఎదురవుతాయి. పిండం ఎదుగుదలలోను, అప్పుడే పుట్టిన శిశువు విషయంలోనూ ఎన్నో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. గర్భవతులు మాదక ద్రవ్యాల ఇంజెక్షన్లు తీసుకుంటే పిండానికి ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం మరింత ఎక్కువవుతుంది.
కాలేయంలో వాపు, లైంగికంగా సంక్రమించే వ్యాధులు సోకే ముప్పును మరింత పెంచుతాయి. ఇంతే కాక, గర్భవతులు మాదక ద్రవ్యాలను ఉపయోగిస్తే, పిండంలో ఎదుగుదల తగినంతగా వుండదు. నెలలు నిండకముందే పిల్లలు పుట్టడం కూడా చాలా వరకు సర్వసాధారణం.
ఇవి కూడా చదవండి
పిల్లల్లో తీవ్ర ఆరోగ్య సమస్యగా ‘స్థూలకాయం’
మీ పిల్లలు దద్దుర్లు, దురదలతో ఇబ్బంది పడుతున్నారా?
Covid-19: పిల్లలకు ప్రత్యేక ఆరోగ్యపు అలవాట్లు నేర్పాల్సిన సందర్భం ఇది