సలహా:
తల్లి కావాలనే కోరిక ఉండని స్త్రీలు ఎవరూ ఉండరు. ఇంకా తను తల్లి కాబోతున్నాను ఇంకో జీవికి జన్మనివ్వబోతున్నాను అనే విషయం ఆ స్త్రీ జీవితానికి ఎంతో హోందాతనాన్ని కూడా తెచ్చిపెతుందని చాలా మండి స్త్రీలు అభిప్రాయ పడుతుంటారు. తల్లి కాబోతున్న విషయం ఎంత సంతోషాన్ని ఇస్తుందో ఆ స్త్రీలో అంతే ఆందోళనని కూడా పెంచుతుంది.
అంతకు ముందు ఎప్పుడూ ఎరుగని మార్పులు శరీరంలో వస్తుంటే ఏం చేయాలో పాలుపోక కాస్తంత ఆందోళనలో ఉంటుంది. అంతే కాకుండా గర్భధారణ ప్రారంభ లక్షణాలు, రుతుక్రమంలో అనుభవించే లక్షణాలు వలే కనిపించడం వల్ల కూడా కొన్నింటిని గుర్తించడం సాధ్యం కాదు. కొన్ని రకాల లక్షణాల ఆధారంగా గర్భం పొందామనే విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్ధారించలేము అంటున్నారు నిపుణులు.
దీని కోసం కొన్ని పరీక్షలు అవసరం అయినప్పటికీ కొన్ని మార్పులను ఆధారంగా చేసుకోవచ్చు. అండం ఫలదీకరణ చెందిన 6 నుంచి 12 రోజుల మధ్యలో గర్భధారణ సంభవిస్తుంది. ఈ సమయంలో రుతు సమయంలో ఉండే తిమ్మిరి ఉంటుంది, కాస్తంత తక్కువగా ఉంటుంది కాబట్టి, రుతుక్రమం మొదలైనట్లుగా భావిస్తారు.
అలాగే యోని నుంచి తెల్లగా ఉండే ద్రవాలు విడుదలౌతూ ఉంటుంది. ఆ తర్వాత అది గట్టి పడడం లాంటి పరిస్థితి ఉంటుంది. ఇదేమంత ప్రమాదకరమైన విషయం కాదు. అయితే కాస్తంత ఇబ్బంది దురదగా ఉంటుంది. చిన్న పాటి మంట కూడా ఉంటుంది. ఈ సమయంలో చెడు వాసన వస్తుంటే మాత్రం ఆలోచించాల్సిందే.